Site icon NTV Telugu

Bandi Sanjay : నీ అయ్యను ఏ పేరుతో పిలవాలో కేటీఆర్ చెప్పాలి

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay : రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం కానీ హద్దు మీరొద్దంటూ కేటీఆర్ పై బండి సంజయ్ ఫైర్‌ అయ్యారు. బీఆర్ఎస్ వ్యవహారం నచ్చకనే ప్రజలు బుద్ధి చెప్పారని, ఏది పడితే అది మాట్లాడటానికి మాకు సంస్కారం అడ్డు వస్తుందన్నారు బండి సంజయ్‌. ఎవరి భాష ఏంటీ , ఎవరి సంస్కారం ఏంటో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు అని ఆయన అన్నారు. నోటీసులకు నోటీసులతోనే సమాధానం చెప్తా అని ఆయన బండి సంజయ్‌ వెల్లడించారు. కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపిస్తా అని, కేటీఆర్ నీ అయ్య, నీ కుటుంబ సభ్యులు వచ్చి డ్రగ్స్ పై సంబంధం లేదని గుండె మీద చేయి వేసుకొని ప్రమాణం చేయమని చెప్పు అని ఆయన అన్నారు.

Jani Master: 36 రోజుల జైలు.. ఎట్టకేలకు బయటకొచ్చిన జానీ మాస్టర్

పార్టీలు మారిన వాళ్ళు వ్యభిచారులు అయితే నీ అయ్యది ముందు ఏ పార్టో కేటీఆర్ చెప్పాలని బండి సంజయ్‌ మండిపడ్డారు.. పార్టీ మారిన వాళ్ళు వ్యాబిచారులు అయితే నీ అయ్యను ఏ పేరుతో పిలవాలో కేటీఆర్ చెప్పాలని బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. దీపావళి వరకు అరెస్టు చేస్తామని కాంగ్రెస్ అంటుందని, అరెస్టు చేస్తే మీ అంతు చూస్తామని బీఆర్ఎస్ అంటుందన్నారు. రెండు పార్టీలు ఒక్కటే, దోందు దొందే అని ఆయన అన్నారు. నువు కొట్టినట్టు చేయు, నేను ఏడ్చినట్టు చేస్తా అన్నట్టు కాంగ్రెస్ బీఆర్ఎస్ లు చేస్తున్నాయని బండి సంజయ్‌ అన్నారు.

US President salary: అమెరికా అధ్యక్షుడికి ఏడాదికి ఎంత సాలరీ.? ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి..?

Exit mobile version