Bandi Sanjay: కారు గ్యారేజీకి పోతోందని నారాజ్ అయితున్నడు.. ‘X’ వేదికగా కేటీఆర్ పై బండి విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి కేటీఆర్ పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ‘X’ వేదికగా విమర్శలు గుప్పించారు. పాపం కారు గ్యారేజీకి పోతోందని #TwitterTillu నారాజ్ అయితున్నడని తెలిపారు. నిజామాబాద్‌ల చెల్లె ఓటమి ఖాయమైందని ముందే ఆగమైతున్నడని పేర్కొన్నారు. కానీ ఏం ఫాయిదా?.. తొమ్మిదేళ్ల మీ దొంగ హామీల దొంగ జపం బట్టబయలైందని ప్రస్తావించారు. అలాగే.. వరంగల్ డల్లాస్ కాలే, కనీసం బస్టాండ్ కూడా రాలే.. వరదలు, బురదలు బోనస్ అన్నారు. నిజామాబాద్‌లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోలే.. 100 కుటుంబాలు కూడా బాగుపడలే, 100 ఏళ్లకు సరిపడా దోపిడీ మాత్రం జరిగిందని దుయ్యబట్టారు.
Read Also: PM Modi: రూ.8,021 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శ్రీకారం
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
మరోవైపు ఆదిలాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్‌లు రాలేదన్నారు. కనీసం అంబులెన్స్ పోయే తోవ కూడా ఎయ్యలేదని విమర్శించారు. గతి లేక గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు మాత్రం ఎక్కువైనయని తెలిపారు. కరీంనగర్ లండన్ కాలే.. వేములవాడకు ఏటా రూ.100 కోట్లు అందలేదన్నారు. కొండగట్టు అంజన్న ఘాట్‌రోడ్డు గతి మారలేదని.. గులాబీ కబ్జాకోర్లు, కీచకులు మాత్రం పెరిగారని మండిపడ్డారు. లక్ష ఉద్యోగాలు రాలే, 3000 భృతి ఇయ్యలే, రైతుల ఆత్మహత్యల ఆగలే, పోడు పంచాయతీ పోలేదన్నారు.
Read Also: Chaitanya Jonnalagadda: నిహారిక మాజీ భర్త రెండో పెళ్లి.. అమ్మాయి ఎవరంటే.. ?
అంతేకాకుండా.. ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ కాలే, పదోన్నతులు పూర్తిగాలేదన్నారు. కొత్త పీఆర్సీ అమలు నోచుకోలే, ఠంచనుగా జీతాలు రాలేదని తెలిపారు. కానీ.. తొమ్మిదేండ్లలో కల్వకుంట్ల ఖజానా నిండిందని.. కల్వకుంట్ల భజనకారులకు కోట్ల కమీషన్లు అందినయి తప్ప, కష్టపడి కొట్లాడిన తెలంగాణ ప్రజలకు ఒరిగిందేం లేదని అన్నారు. తొమ్మిదేండ్లు గాడిద పండ్లు తోమి.. ఇప్పుడు గాయి చేస్తే నమ్మేందుకు తెలంగాణ ప్రజలు అమాయకులు కాదన్నారు. దొంగ హామీలు, దగా మాటలు, దౌర్జన్య చేతలకు కాలం చెల్లిందని ‘X’ వేదికగా బండి సంజయ్ విరుచుకుపడ్డారు.
పాపం కారు గ్యారేజీకి పోతోందని #TwitterTillu నారాజ్ అయితున్నడు
నిజామాబాద్‌ల చెల్లె ఓటమి ఖాయమైందని ముందే ఆగమైతున్నడు
కానీ ఏం ఫాయిదా?
తొమ్మిదేళ్ల మీ దొంగ హామీల దొంగ జపం బట్టబయలైందివరంగల్ డల్లాస్ కాలే
కనీసం బస్టాండ్ కూడా రాలే
వరదలు, బురదలు బోనస్నిజామాబాద్లో బోధన్ షుగర్…
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) October 3, 2023
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..