NTV Telugu Site icon

Bandi Sanjay : రేవంత్ రెడ్డికి బండి సంజయ్ కౌంటర్

Bandi Sanjay

Bandi Sanjay

మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు సందర్భంగా.. ట్యాంక్ బండ్ పై బసవేశ్వర విగ్రహానికి బండి సంజయ్, ఈటల రాజేందర్, లక్ష్మణ్ తదితరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. భాగ్యలక్ష్మి టెంపుల్ కు ప్రతి ఒక్కరు రావాలని తన కోరిక నెరవేరింది అన్న సంజయ్.. తన పదవి పోతుందన్న భయంతోనే రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నాడన్నారు. రేవంత్ రెడ్డి పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్నట్టున్నాడని, 25 కోట్లు రేవంత్ రెడ్డికి ఇచ్చానని ఈటెల రాజేందర్ ఎక్కడ అనలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారని మాత్రమే ఈటల అన్నారని, కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ఆర్థిక సహాయం చేస్తోందన్నారు.

Also Read : Mahesh Kumar Goud : ఢిల్లీలో అమిత్ షా, కేసీఆర్ ఒకటయ్యారు

రాజ్దీప్ సర్దేశాయి కూడా.. బీఆర్ఎస్ దేశమంతా పార్టీలకు ఆర్థిక సాయం చేస్తుందనే అన్నారని ఆయన వ్యాఖ్యానించారు. దానికి ఎలాంటి ప్రూఫ్ లున్నాయని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని, ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కూడా ఇదే మాటలు అంటున్నారన్నారు. బీఆర్ఎస్ వద్ద కాంగ్రెస్ డబ్బులు తీసుకున్న మాట వాస్తవమని బండి సంజయ్‌ ఉద్ఘాటించారు. మునుగోడులోను ఇదే విషయం ప్రచారం అయిందని, మునుగోడు ఓటర్లు స్వయంగా మాట్లాడుకున్నారన్నారు. అతీక్ అహ్మద్ లాంటి గుండాకోరు చనిపోతే ఎంఐఎం సంతాప సభలు పెట్టడం ఏంటని, అతీక్ అహ్మద్ మరణంపై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే స్పందించడం సిగ్గుచేటన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు అవసరమా అని ఆయన అన్నా వ్యాఖ్యానించారు.

Also Read : Ashwini Choubey : కనిపిస్తే కాల్చేయాలి.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు