NTV Telugu Site icon

Bandi Sanjay : విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకోరా?

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay : ట్రిపుల్ ఐటీ ముట్టడికి వెళ్తున్న ఏబీవీపీ నాయకులు అరెస్ట్‌లను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఖండించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ స్పందిస్తూ.. ఏబీవీపీ నాయకులపై పోలీసుల, బాసర ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడం దుర్మార్గమన్నారు. ఆత్మహత్య చేసుకున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధినికి న్యాయం చేయమంటే విచక్షణారహితంగా దాడి చేయిస్తారా? అని, బాసర ట్రిపుల్ లో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకోరా? అని ఆయన ప్రశ్నించారు.

Bhairathi Ranagal: త్వరలో తెలుగులో కన్నడ థ్రిల్లర్ “భైరతి రణగల్”

అంతేకాకుండా.. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను ఎందుకు పరిష్కరించడం లేదు? అని, విద్యార్ధుల పక్షాన ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని ఆయన మండిపడ్డారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు బండి సంజయ్‌. ట్రిపుల్ ఐటీ విద్యార్ధి స్వాతి ప్రియ ఆత్మహత్యకు కారణాలపై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆత్మహత్య చేసుకున్న స్వాతిప్రియ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని బండి సంజయ్‌ అన్నారు. అరెస్ట్ చేసిన ఏబీవీపీ నాయకులను తక్షణమే విడుదల చేయాలని, ఇంకా జాప్యం చేయకుండా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు బండి సంజయ్‌.

AP Assembly: టిడ్కో ఇళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు.. అసెంబ్లీ సోమవారానికి వాయిదా