Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Karimnagar Bandi Sanjay Challenged To Congress

Bandi Sanjay : అధికారం ఊడబీకినా కేటీఆర్ అహంకారం తగ్గలేదు

Published Date :April 29, 2024 , 4:32 pm
By Gogikar Sai Krishna
Bandi Sanjay : అధికారం ఊడబీకినా కేటీఆర్ అహంకారం తగ్గలేదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కొట్టిపారేశారు. ఓడిపోతారనే భయంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కై ఒకే స్వరాన్ని విన్పిస్తూ ప్రజల్లో భయందోళనలను స్రష్టిస్తున్నాయని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయా నేతలకు సవాల్ విసిరారు ‘‘డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా రిజర్వేషన్లను బీజేపీ ప్రభుత్వం యధాతథంగా కొనసాగిస్తుంది. ఈ మాటకు మేం కట్టుబడి ఉన్నాం. ఇదే విషయంపై బీజేపీ పక్షాన నేను ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నా. మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిని కూడా ఒప్పించి తీసుకొస్తా.. డేట్, టైం, వేదిక మీరే ఫిక్స్ చేయండి. అదే సమయంలో రాజ్యాంగ స్పూర్తికి భిన్నమైన, సుప్రీం తీర్పుకు వ్యతిరేకమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రమాణం చేసే దమ్ము మీకుందా?’’అని సీఎం, కేటీఆర్ లకు సవాల్ విసిరారు. రిజర్వేషన్ల రద్దు పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కుమ్కక్కై ప్రజల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు.

బండి సంజయ్ అవినీతిపరుడంటూ కేటీఆర్, పొన్నం ప్రభాకర్ చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. ‘‘నేను అవినీతికి పాల్పడితే ఇన్నాళ్లు అధికారంలో ఉన్నది మీరే కదా… నాపై ఎందుకు చర్యలు తీసుకోలే? ఎందుకు ఆధారాలు చూపలే. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం పీకినవ్. మీ ఆస్తిపాస్తులపై, నా ఆస్తిపాస్తులపై విచారణకు సిద్ధమా? నేను రడీ… అట్లాడే అవినీతి, ఆస్తులపై దేవుడి ముందు ప్రమాణం చేసేందుకు సిద్దమా?..’’అంటూ సవాల్ విసిరారు.

ఈరోజు ఉదయం కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో వివిధ టీవీ ఛానళ్ల ప్రతినిధులు బండిసంజయ్ ను కలిసి రిజర్వేషన్ల రద్దు, హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిన ఆరోపణలను ప్రస్తావించగా సంజయ్ పై విధంగా స్పందించారు. ఏమన్నారంటే…

తెలంగాణలో బీఆర్ఎస్ భూస్తాపితం కావడానికి ప్రధాన కారణం కేటీఆర్. జనం ఛీ కొట్టినా ఆయనకు అహంకారం తగ్గలేదు. కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నడు. అమెరికాలో చిప్పలు కడిగిన బతుకు నీది. మీ అయ్య లేకపోతే… నిన్ను కుక్కలు కూడా దేఖవు. అమెరికాలో రబ్బరు చెప్పులు, ముడతల చొక్కతో తిరిగే నువ్వు మీ అయ్య టీఆర్ఎస్ పెడితే వచ్చి సిరిసిల్ల టిక్కెట్ పై పోటీ చేసి కేకే మహేందర్ రెడ్డి పొట్ట కొట్టిన నీచుడివి. అధికారంలో ఉంటూ కేటీఆర్ చేసి అవినీతి, అక్రమాల చిట్టాతోపాటు ఆయన భాగోతమంతా బయటకు తీస్తున్నా. త్వరలోనే ప్రజల ముందు పెడతా.

నేను మా అయ్య పేరు చెప్పుకుని రాలే. 1994లోనే అర్బన్ బ్యాంకు డైరెక్టర్ గా గెలిచిన. ఆ తరువాత కూడా మళ్లీ డైెరెక్టర్ గా గెలిచిన. 2005 నుండి రెండు సార్లు కార్పొరేటర్ గా పోటీ చేసిన గెలిచిన. 2014, 18లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన. 2019లో ఎంపీగా పోటీ చేసి 89 వేలకుపైగా మెజారిటీతో గెలిచిన.

బండి సంజయ్ 5 ఏళ్లు గాలి తిరుగుళ్లు, గాలి మాటలు చెప్పుడు తప్ప ఏం తెలుసని అంటావా? మీ లెక్క గాలి మాటలు చెప్పి వేల కోట్లు దోచుకోవడం నాకు తెల్వదు. మీ చెల్లి లెక్క గాలి మాటలు చెప్పి పంజాబ్, ఢిల్లీలో లిక్కర్ దందాలు చేయడం తెల్వదు…

అకాల వర్షాలతో రైతులు పంట నష్టపోయి అల్లాడుతుంటే అధికారంలో ఉండి కేసీఆర్ నయాపైసా ఇయ్యకపోతే వాళ్ల దగ్గరకు పోయి అండగ నిలిచిన. రుణమాఫీ ఇయ్యకుంటే, వడ్లు కొనకపోతే రైతుల పక్షాన పోరాడిన… నిరుద్యోగులకు ఉద్యోగాలియ్యకుండా రోడ్డునపడేస్తే వాళ్ల పక్షాన కొట్లాడి జైలుకు పోయిన. 317 జీవో సవరించాలని ఉద్యోగులు రోడ్డున పడితే వాళ్ల పక్షా ధర్నాలు చేసి జైలుకు పోయిన. ప్రజా సమస్యలపై ఐదేళ్లపాటు లాఠీదెబ్బలు తిన్న. వందల కేసులు పెట్టినా వెరవకుండా పోరాడిన. మీ ద్రుష్టిలో ఇవన్నీ గాలి తిరుగుళ్లా? ప్రజా సమస్యలను గాలికొదిలేసి, ప్రశ్నించిన వాళ్లను రాచిరంపాన పెట్టి మీరు మాత్రం విదేశాలకు వెళ్లి వేల కోట్లు దాచి పెట్టుకోవడమే మీ ద్రుష్టిలో మంచి తిరుగుళ్లా?.. సిగ్గుండాలే. జనం గద్దె దించి మీ కుటుంబాన్ని ఛీ కొట్టినా ఇంకా బుద్దిరాలే. జూన్ 4 తరువాత జనం బీఆర్ఎస్ పార్టీని పాతాళంలోకి తొక్కబోతున్నరు. అప్పుడైనా మీకు బుద్ది రావాలని కోరుకుంటున్నా..’ అని బండి సంజయ్‌ అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • bjp
  • breaking news
  • BRS
  • congress

తాజావార్తలు

  • India anti dumping duty China: గ్యాస్‌ సంక్షోభ సమయంలో భారత్‌ సంచలన నిర్ణయం దిశగా అడుగులు.. చైనాకు షాక్..!

  • Dhurandhar 4 days Collections : ధురంధర్ 2 వరల్డ్ వైడ్ 4 డేస్ కలెక్షన్స్.. ఊచకోత కోసిన రణవీర్ సింగ్

  • CM Revanth Reddy: హైదరాబాద్ ట్రాఫిక్‌కు చెక్.. 24 వేల కోట్లతో మెట్రో విస్తరణ..!

  • Smart TV: టీవీలపై క్రేజీ ఆఫర్లు.. 24 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ. 6,000 కంటే తక్కువకే

  • PM Narendra Modi: మధ్యాహ్నం 2 గంటలకు ప్రధాని మోడీ కీలక ప్రకటన..

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions