Pulivendula Re-Polling: రీ-పోలింగ్‌పై గందరగోళం.. పులివెందులలో ఇంకా తెరుచుకోని పోలింగ్ కేంద్రం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Municipal Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు పట్టణ స్థానిక సంస్థల్లో 12 పోలింగ్ బూత్‌లకు నేడు రీ-పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జగరనుంది. అయితే కడప జిల్లా పులివెందులలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద మాత్రం పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. జెండామాన్ వీధిలోని గర్ల్స్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఇంకా తాళాలు వేసి ఉండటంతో ఓటర్లు, రాజకీయ నాయకుల్లో అయోమయం నెలకొంది.
పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 8వ వార్డులోని 8-1 పోలింగ్ బూత్‌కు ఈరోజు రీ-పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. అయితే పోలింగ్ కేంద్రం తెరుచుకోకపోవడంతో ఓటర్లు అక్కడికి వచ్చి వేచి చూస్తున్నారు. పోలింగ్ జరుగుతుందా?, లేదా? అనే సందిగ్ధంలో ఓటర్లు ఉండగా.. అధికారుల నుంచి స్పష్టత లేకపోవడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రీ-పోలింగ్ నిర్వహణపై అధికారులు, ప్రజలకు సైతం స్పష్టత లేకపోవడంతో ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. నిర్ణీత సమయానికి పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కేంద్రం వద్ద తాళాలు ఉండటంతో ఎన్నికల ప్రక్రియపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రీ-పోలింగ్ జరగనున్న ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాల వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read
- UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
- Murusu Cyclone Alert: దూసుకొస్తున్న మురసు తుఫాన్.. నేడు అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
- IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
- SOS బటన్, Family Assist ఫీచర్లtho 'సీనియర్ సిటిజన్ల' కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
రీ-పోలింగ్ డీటెయిల్స్:
అనంతపురం: 30వ వార్డులోని 30/3 పోలింగ్ స్టేషన్
చీమకుర్తి: ప్రకాశం జిల్లాలోని 14వ వార్డులో 14/1 పోలింగ్ స్టేషన్
మాచర్ల: పల్నాడు జిల్లాలోని 23వ వార్డులో 23/1, 23/2 పోలింగ్ స్టేషన్లు
పులివెందుల: 1, 3, 7, 8 వార్డుల్లోని 1-1, 3-1, 7-1, 8-1 పోలింగ్ బూత్‌లు
కడప: 15వ వార్డులోని 15-2 పోలింగ్ బూత్
జమ్మలమడుగు: 3/2, 17/1, 29/1 పోలింగ్ బూత్‌లు
తాజావార్తలు
-
Pulivendula Re-Polling: రీ-పోలింగ్‌పై గందరగోళం.. పులివెందులలో ఇంకా తెరుచుకోని పోలింగ్ కేంద్రం!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
India Renewable Energy Summit 2026: ప్రధాని మోడీ చేతుల మీదుగా.. నేడు ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ 2026 ప్రారంభం
-
Murusu Cyclone Alert: దూసుకొస్తున్న మురసు తుఫాన్.. నేడు అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
ట్రెండింగ్
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు