దేశంలో చమురుధరలు ఆకాశాన్నంటాయి. ఈమధ్య కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ధరలు కొంచెం దిగివచ్చాయి. కొన్ని రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించుకోవడంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగిపోవడంతో ద్రవ్యోల్బణం కూడా బాగా పెరిగింది. ఆల్ టైం హైకి చేరింది. గోధుమల ధరల్ని నియంత్రించేందుకు కేంద్రం ఎగుమతుల్ని నిషేధించింది. అదే బాటలో మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం.
పంచదార ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశంలో ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో డిమాండ్‌కు తగ్గట్టు నిల్వలు, ధరల స్థిరీకరణ దృష్ట్యా గత ఆరేళ్లలో తొలిసారి పంచదార ఎగుమతులపై పరిమితులు విధించింది. 100 LMT(లాంగ్ టన్ మెజర్‌మెంట్)లకు మించి పంచదార ఎగుమతి చేయడానికి వీల్లేదని ప్రకటించింది. జూన్ 1 నుంచి ఈ నిబంధన వర్తించనుంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా పంచదార సప్లయ్‌లో తేడాలు వచ్చాయి. దీంతో దేశీయంగా పంచదార ధరలు పెరిగాయి. కేంద్రం తాజా నిర్ణయంతో పంచదార మరింతగా అందుబాటులోకి రానుంది.
కేంద్రం విధించిన ఈ పరిమితి సెప్టెంబర్ 30, 2022 వరకూ వర్తిస్తుంది. ఈసీజన్ వరకూ దేశంలో 65-65 ఎల్‌ఎంటీ టన్నుల పంచదార నిల్వలు అందుబాటులో వుంటాయి. ఈ స్టాక్ దాదాపు 2-3 నెలలపాటు సరిపోతుందని కేంద్రం చెబుతోంది. నెలకు దాదాపు 24 ఎల్‌ఎంటీ పంచదార అవసరమవుతుంది. పండుగల సీజన్లో పంచదార వినియోగం ఎక్కువగా వుంటుంది. అక్టోబర్, నవంబర్ నాటికి పంట చేతికి వస్తుంది. దీంతో తదుపరి వినియోగం కోసం ప్రస్తుతం విధించిన నిషేధం ఉపకరిస్తుంది.
TDP : పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్..! |