Jammu: జమ్మూలో బాణాసంచా అమ్మకాలపై నిషేధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ (PM Modi) మంగళవారం జమ్మూలో (Jammu) పర్యటించనున్నారు. రూ.13,375 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేయనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో బాణాసంచా అమ్మకాలపై అధికారులు నిషేధం విధించారు. నేటి నుంచి మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు క్రాకర్స్‌పై నిషేధం విధిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొ్న్నారు. ఇప్పటికే డ్రోన్లు ఎగురవేతను నిషేధించింది.
Also Read
ప్రధాని మోడీ జమ్మూలో నిర్మించిన ఎయిమ్స్‌ను మంగళవారం ప్రారంభించబోతున్నారు. ఈ ఆస్పత్రికి పునాది రాయిని మోడీ 2019 ఫిబ్రవరిలో వేశారు. అంతేకాకుండా 48.1 కి.మీ పొడవైన బనిహాల్-సంగల్దాన్ రైల్వే సెక్షన్‌ను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ రైలు విభాగం కాశ్మీర్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలుపుతూ 272 కి.మీ పొడవైన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు తిరిగనుంది. జమ్మూ కాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించిన తర్వాత ప్రధాని మోడీ చేపట్టిన రెండో పర్యటన ఇది. ప్రధాని ఈ పర్యటనను జాతికి అంకితం చేయనున్నారు.
ఇదిలా ఉండగా జమ్మూ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనానికి కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఈ కొత్త టెర్మినల్ 40 వేల చదరపు మీటర్లలో విస్తరించి ఉంది. ఇందులో సుమారు 2000 మంది ప్రయాణికులకు సేవలను అందించవచ్చు. దీనితో పాటు, ఈ టెర్మినల్‌లో ఆధునిక సౌకర్యాలు కూడా ఉంటాయి. ఈ కార్యక్రమంలో జమ్మూ – కత్రా మధ్య నిర్మించిన ఢిల్లీ-అమృత్‌సర్-కత్రా ఎక్స్‌ప్రెస్‌వే రెండు ప్యాకేజీలతో పాటు ఇతర ముఖ్యమైన రహదారి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. జమ్మూలో కామన్ యూజర్ ఫెసిలిటీ పెట్రోలియం డిపోను అభివృద్ధి చేసే ప్రాజెక్టుకు కూడా మోడీ శంకుస్థాపన చేస్తారు.
Sale/purchase and use of firecrackers prohibited in Jammu district with immediate effect until 5 pm on 20th February in wake of the upcoming VVIP visit in the district. pic.twitter.com/gr3plnFzf7
— ANI (@ANI) February 19, 2024
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!