తమిళనాడులో మరో రాజకీయ నాయకుడిపై హత్యాయత్నం జరిగింది. తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు, దళిత నాయకుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యను ఇంకా మరువక ముందే మరో నాయకుడిపై హత్యాయత్నం జరగడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యను పీఎంకే వ్యవస్థాపకుడు రామదాస్, పార్టీ కార్యకర్త శంకర్ ఖండించారు. దీంతో వారికి బెదిరింపులు మొదలయ్యాయి.
ఇది కూడా చదవండి: Mumbai: పట్టాలపై జారిపడ్డ మహిళ పైనుంచి వెళ్లిన రైలు.. సురక్షితంగా బయటకు
సోమవారం కడలూరు జిల్లాలో పీఎంకే పార్టీ కార్యకర్త శంకర్‌పై నలుగురు వ్యక్తుల ముఠా దారుణంగా దాడి చేసింది. గాయపడిన శంకర్ అనే కార్యకర్తను పుదుచ్చేరి తీసుకెళ్లారు. జిప్మర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారి తెలిపారు. దాడి అనంతరం దుండగులు పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Minister Seethakka: సహించేది లేదు.. సోషల్ మీడియా ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం
ఇక ఈ దాడిని పీఎంకే అధినేత రామదాస్ ఖండించారు. పోలీసుల అలసత్వం, అసమర్థతే కారణమని ధ్వజమెత్తారు. మూడేళ్ల క్రితం జరిగిన తన సోదరుడి హత్య కేసులో శంకర్ సాక్షి అని రామదాస్ పేర్కొన్నారు. హత్య కేసులో కోర్టులో సాక్ష్యం చెప్పొద్దని నిందితులు బెదిరిస్తున్నారు. పోలీసులకు సమాచారం ఉన్నప్పుటికీ రక్షణ కల్పించలేదన్నారు. ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదని రామదాస్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Ambati Rambabu: ఆంధ్ర, తెలంగాణ సీఎంల భేటీ.. మాజీ మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు
గత శుక్రవారం బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యకు గురయ్యారు. రెండు, మూడ్రోజుల్లోనే మరో హత్యాయత్నం జరగడం రాష్ట్రంలో శాంతిభద్రతలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక యూపీ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి.. హత్యను తీవ్రంగా ఖండించారు. విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కోరారు.
கடலூரில் பா.ம.க. நிர்வாகிக்கு அரிவாள் வெட்டு
கண்டிக்கத்தக்கது: திமுக ஆட்சியில் சட்டம் –
ஒழுங்கு முற்றிலுமாக சீர்குலைந்து விட்டது!கடலூர் மாவட்டம் சூரப்பநாயக்கன் சாவடியைச் சேர்ந்த பாட்டாளி மக்கள் கட்சியின் நிர்வாகி சங்கர், அதே பகுதியைச் சேர்ந்த நால்வரால் கொடூரமாக… pic.twitter.com/l1Z1L7l3df
— Dr S RAMADOSS (@drramadoss) July 7, 2024