నట సింహం నందమూరి బాలకృష్ణ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నారు.కథ నచ్చితే చాలు కొత్త దర్శకులతో అయిన సినిమా చేయడానికి ఆయన సిద్ధం గా ఉంటారు.ఇటీవలే యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన భగవంత్ కేసరి మూవీతో బాలయ్య మరో సూపర్ హిట్ అందుకున్నారు. అలాగే తన తరువాత సినిమాను మరో యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది. ఇదిలా ఉంటే బాలయ్య మరో యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం.కేవలం మూడు సినిమాలు మాత్రమే చేసిన అనుభవం ఉన్న దర్శకుడితో ఆయన సినిమా చేయనున్నారని సమాచారం.
నాని హీరోగా నటించిన పీరియాడిక్ సోషియో ఫాంటసీ ఫిల్మ్ ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రానికి దర్శకత్వం వహించిన రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో బాలయ్య నటించనున్నట్లు తెలుస్తుంది.ఇటీవల బాలకృష్ణను కలిసి రాహుల్ సాంకృత్యాన్ ఓ స్టోరీ ని చెప్పారట.బాలయ్య కోసం ఈ దర్శకుడు ఓ పీరియడ్ డ్రామా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు సమాచారం… ప్రస్తుతానికి ఈ సినిమా చర్చల దశలో ఉంది. కథ నచ్చితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.బాబీ సినిమా తర్వాత బాలకృష్ణ మరో సినిమాకు అయితే కమిట్ కాలేదు. బహుశా రాహుల్ సాంకృత్యాన్ సినిమా ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి.అలాగే తనకు ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి విజయాలు అందించిన దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలోనూ బాలకృష్ణ ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.ఆ సినిమా కోసం నందమూరి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.మరి వీరి కాంబోలో మరో సినిమా వస్తుందో లేదో చూడాలి.