పాతబస్తీ బాలాపూర్‌లో రౌడీ షీటర్ రియాజ్ హత్య కేసును బాలాపూర్ పోలీసులు ఛేదించారు. ఈనెల 9వ తేదీన బాలాపూర్ ARCI రోడ్డుపై రియాజ్ పై కాల్పులు జరిపి హతమార్చింది సూపారీ గ్యాంగ్. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. బాలాపూర్ లో జరిగిన గ్యాంగ్ స్టర్ రియాజ్ హత్య కేసును ఛేదించామని, ఎనిమిది మంది నిందితుల అరెస్ట్ చేశామని సీపీ సుధీర్ బాబు తెలిపారు. ప్రధాన నిందితుడు హమీద్ పరారీలో ఉన్నాడని…