Akhanda 2: మాస్ కాంబోలో నాలుగో చిత్రం.. ఈసారి ‘అఖండ’ తాండవమే!
- మరోసారి బాలకృష్ణ-బోయపాటి మాస్ కాంబో
- అఖండ సినిమాకు సీక్వెల్
- అఖండ 2-తాండవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhanda 2 Thaandavam Poster Released: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను మాస్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. లాక్‌డౌన్ టైంలో అదీనూ సీజన్ కాని సమయంలో రిలీజైన అఖండ చిత్రం బాలయ్య బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ల జాబితాలో చేరింది. అప్పుడే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. నేడు అధికారికంగా అనౌన్స్ చేశారు.
అఖండకు సీక్వెల్‌గా ‘అఖండ 2 – తాండవం’ తెరకెక్కనుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. టైటిల్ పోస్టర్‌ను నిర్మాణ సంస్థ ఈరోజు విడుదల చేసింది. అఖండ 2 అనే టైటిల్‌కి తాండవం అనే ట్యాగ్ లైన్ జోడించారు. తొలి భాగం ఎక్కడైతే ఆగిందో.. అక్కడి నుంచే రెండో భాగం మొదలవుతుంది. అఖండ పాప పెద్దయిన తర్వాత ఏం జరిగిందనేది ఇందులో చూపించబోతున్నారు. బుధవారం పూజా కార్యక్రమంతో అఖండ 2ను లాంచ్ చేయనున్నారు.
Also Read
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
- Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
Also Read: Nani Heroine: ఆ ఇద్దరిలో నాని హీరోయిన్ ఎవరు?
స్కంద డిజాస్టర్ తర్వాత బోయపాటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరోవైపు బాలయ్య బాబు వరుస హిట్స్ కొడుతుండడంతో అఖండ 2పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బాబీ మూవీతో బాలయ్య బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ తర్వాతే అఖండ 2 షూటింగ్‌లో ఆయన పాల్గొంటారు. సీక్వెల్‌కి తమన్ సంగీతం అందిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని నందమూరి తేజస్విని సమర్పిస్తున్నారు.
తాజావార్తలు
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!