Bala Veeranjaneya Swami: బాధ్యతలు స్వీకరించిన మంత్రి బాల వీరాంజనేయ స్వామి..
- బాధ్యతలు స్వీకరించిన మంత్రి బాల వీరాంజనేయ స్వామి
- వేద మంత్రోచ్ఛారణల మధ్య ఛాంబర్లోకి అడుగు పెట్టిన మంత్రి
- తన మీద చంద్రబాబు ఉంచిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తాం- మంత్రి
- తన శాఖ ద్వారా పేదలకు మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది- మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి బాల వీరాంజనేయ స్వామి బాధ్యతలు స్వీకరించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ఛాంబర్లోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన మీద చంద్రబాబు ఉంచిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తానని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. తన శాఖ ద్వారా పేదలకు మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని అన్నారు. 2014-19 కాలంలో కొన్ని గురుకుల పాఠశాలల్లో అదనపు సీట్లు ఇచ్చామని.. గత ప్రభుత్వంలో జగన్ ఈ సీట్లను రద్దు చేశారని తెలిపారు. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1600 ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు.. సింగరాయకొండలో బైపీసీలో 40, ఎంపీసీలో 40 సీట్లు రద్దు చేశారు.. వాటిని తిరిగి పునరుద్దరిస్తూ తొలి సంతకం చేశానని చెప్పారు.
Rohit-Pant: రిషబ్ పంత్ అత్యుత్సాహం.. రోహిత్ శర్మ సీరియస్ (వీడియో)!
Also Read
- Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
- LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
- UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
అలాగే.. పర్చూరు నియోజకవర్గం, నాగులుపాలెం గురుకుల పాఠశాలలో పైలెట్ ప్రాజెక్టు కింద రూ. 15 లక్షలతో సోలార్ ప్రాజెక్టును హట్ వాటర్ కోసం మంజూరు చేశామన్నారు. గత ప్రభుత్వంలో ఫీజు రిఎంబర్స్మెంట్ పథకం కింద నోడల్ ఏజెన్సీగా సోషల్ వెల్పేర్ డిపార్మెంట్ ఉందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కలిపి రూ. 2505.56 కోట్లు గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టారని ఆరోపించారు. వాటిని ఇప్పడు తాము చెల్లించాల్సి వస్తోందని చెప్పారు. బకాయిలు చెల్లించకుంటే వారికి సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్ధితి ఉందని తెలిపారు.
Jammu Kashmir: దోడాలో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం..
మరోవైపు.. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకానికి రూ. 199 కోట్లు బకాయిలున్నాయని మంత్రి బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. అంబేద్కర్ విదేశీ విద్య పథకం కింద రూ. 5.69 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లారని తెలిపారు. బెస్ట్ ఎవైలబుల్ స్కూళ్లను గత ప్రభుత్వం రద్దు చేసి రూ. 60.10 కోట్లు బకాయిలు పెట్టిందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టానికి సంబంధించి వారికి రావాల్సిన బకాయిలు ఆర్ధిక శాఖ నుంచి రూ. 21.81 కోట్లు బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు. అన్ని పథకాలపై గత ప్రభుత్వంలో మొత్తం బకాయి రూ. 3573.22 కోట్లుగా ఉందని తెలిపారు. ఇప్పడు ఆ భారం మొత్తం తమ ప్రభుత్వంపై పడిందని మంత్రి పేర్కొ్న్నారు.
తాజావార్తలు
-
Boycott Peddi: మెగా పవర్ స్టార్‌కు సింగిల్ స్క్రీన్ల షాక్.. ‘పెద్ది’ని బహిష్కరించిన తెలంగాణ ఎగ్జిబిటర్లు!
-
Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
-
Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్‌షీట్’ సెలబ్రేషన్!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?