Jigarthanda Double X: లారెన్స్ ఏంటి ఇంత భయంకరంగా ఉన్నాడు.. జిగర్ తండా డబుల్ ఎక్స్ టీజర్ చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jigarthanda Double X Telugu Version teaser: దర్శక నిర్మాత కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై కార్తికేయన్ నిర్మిస్తోన్న ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను హై యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. సోమవారం ఈ సినిమా తెలుగు టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ రిలీజ్ చేసి యూనిట్‌కి అభినందనలు తెలియజేశారు. తెలుగు టీజర్‌ను మహేష్ విడుదల చేయగా తమిళ టీజర్‌ను ధనుష్, కన్నడ టీజర్‌ను రక్షిత్ శెట్టి, మలయాళ టీజర్‌ను దుల్కర్ సల్మాన్ ఒకేసమయంలో రిలీజ్ చేశారు. ఇప్పటికే షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకునే పనిలో ఉంది. దీపావళికి ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ఎంటైర్ టీమ్ కష్టపడుతోంది. తమిళనాడు, కేరళల్లో బ్యూటీఫుల్ లొకేషన్స్‌తో పాటు భారీ సెట్స్ వేసి సినిమా షూట్ చేశారు. యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న్ ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ బాహు భాషా చిత్రంగా దీపావళికి రిలీజ్ కానుందని అంటున్నారు.
Perni Nani: చంద్రబాబు ఎన్నో స్కామ్ లు చేశారు..
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
2014 బ్లాక్ బస్టర్ అయిన జిగర్ తండా సినిమాకు ఇది ప్రీక్వెల్ కావడంతో అనౌన్స్‌మెంట్ రోజు నుంచి సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. నాటి జిగర్ తండా స్టైల్లోనే దీన్ని యాక్షన్ గ్యాంగ్ స్టర్ జోనర్‌లోనే కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్నట్టు టీజర్ తో క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో లారెన్స్ పాత్ర, దాన్ని డిజైన్ చేసిన తీరు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ముఖ్యంగా బీజీఎమ్ అయితే నెక్స్ట్ లెవల్ అన్నట్టు ఉంది. జాతీయ అవార్డ్ సినిమాటోగ్రాఫర్ తిరు ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందిస్తుండగా మెర్క్యురీ, రజినీకాంత్ పేట్ట చిత్రాల తర్వాత కార్తీక్ సుబ్బరాజ్, తిరు కాంబోలో వస్తోన్న సినిమా ఇదే. జిగర్ తండా సినిమాకు సంగీతాన్ని అందించిన సంతోష్ నారాయణన్ ఇప్పుడు ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’కు సంగీత సారథ్యం వహించగా షఫీక్ మొహమద్ అలీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆసక్తి రేపే ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కార్తీక్ సుబ్బరాజ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని అంటున్నారు.
Happy to present the teaser of #JigarthandaDoubleX!! Best wishes to @iam_SJSuryah @karthiksubbaraj @offl_Lawrence and the entire team!https://t.co/qGhoZ8MXUs@Music_Santhosh @stonebenchers @kaarthekeyens @kathiresan_offl @5starcreationss @Alankar_Pandian
— Mahesh Babu (@urstrulyMahesh) September 11, 2023
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?