Anand Deverakonda and Vaishnavi Chaitanya Remuneration for Baby Movie: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రల్లో వచ్చిన సినిమా ‘బేబీ’. ‘హృదయకాలేయం’తో మెగాఫోన్ చేతపట్టిన సాయి రాజేశ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఎస్‌కేఎన్ నిర్మాతగా వ్యవహరించిన బేబీ సినిమా జులై 14న రిలీజ్ అయింది. ‘మొదటి ప్రేమకి మరణం లేదు. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది’ అంటూ రూపొందిన ఈ సినిమా యువతకు బాగా కనెక్ట్ అయ్యింది. మొదటి రోజు నుంచే మంచి టాక్‌ను తెచ్చుకున్న బేబీ సినిమా.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మిడ్ రేంజ్ సినిమాల్లో వేగంగా 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా నిలిచింది.
యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య.. బేబీ సినిమాలో తన నటనలోని మరో కొత్త కోణాన్ని చూపించారు. వైష్ణవి నటనకు యువత బాగా కనెక్ట్ అయ్యారు. సినిమా చూసిన కొందరు ఆమె పాత్రను దారుణంగా తిడుతున్నారు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటనలో మరో వేరియేషన్ చూపించాడు. అద్భుతమైన నటనతో అందరికి కన్నీళ్లు తెప్పించాడు. ఇక విరాజ్ అశ్విన్ కూడా వైష్ణవి, ఆనంద్‌కు పోటీగా నటించాడు.
అయితే తమ నటనతో ఆకట్టుకున్న ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda Remuneration), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya Remuneration), విరాజ్ అశ్విన్‌ల రెమ్యునరేషన్ చాలా తక్కువ అని తెలుస్తోంది. ముగ్గురి రెమ్యునరేషన్ కలిపి కోటిన్నర కూడా లేదని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆనంద్ రూ. 80 లక్షలు, వైష్ణవి రూ. 30 లక్షలు, అశ్విన్ రూ. 20 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్. ఇక డైరెక్టర్ సాయి రాజేష్ మాత్రం కోటికి పైగా తీసుకున్నాడని తెలుస్తోంది. బేబీ సినిమా హీరో, హీరోయిన్ రెమ్యునరేషన్ తెలిసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియరాలేదు.
Also Read: Virat Kohli Century: ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ ఆలౌట్! విండీస్ స్కోర్ 86/1
Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన పసిడి ధరలు!