Vemulawada: మరో అరుదైన ఘటనకు ప్రపంచం సిద్ధమవుతోంది! ఈ నెల 29న చంద్రగ్రహణం ఏర్పడనుంది. సూర్యగ్రహణం పూర్తయిన 14 రోజుల తర్వాత చంద్రగ్రహణం ఏర్పడడం గమనార్హం. ఒకే నెలలో రెండు గ్రహణాలు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈనేపథ్యంలో.. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల (28-10-2023) శనివారం మధ్యాహ్నం 1.16 నుంచి 1.51 గంటల వరకు రాహు గ్రస్త చంద్రగ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో రాజన్న ప్రధాన ఆలయానికి అనుబంధంగా ఉన్న ఆలయాలను కూడా మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. శనివారం సాయంత్రం 4:15 pm నుండి ఆదివారం గ్రహణం తర్వాత (29-10-2023) ఆలయాలకు తిరిగి, గ్రహణం అనంతరం 3:40 నిమిషాలకు సుప్రభాత పూజలు నిర్వహించి, భక్తులకు దర్శనం కోసం సేవలు ప్రారంభిస్తారు. గ్రహణం సందర్భంగా ఆదివారం ఆలయంలో జరిగిన కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.
లోకకళ్యాణార్థం శ్రీరాజరాజేశ్వర స్వామివారి క్షేత్రంలో ప్రతిరోజు నాలుగుసార్లు స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు దూరప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకుని.. ముందుగా పుష్కరిణిలో స్నానమాచరించాలి. స్వామివారికి ఇష్టమైనవాటిని చెల్లించి సేవల్లోకి ప్రవేశిస్తారు. గ్రహణ సమయంలో గర్భిణులు భోజనం చేయరాదని, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని పురోహితులు సూచిస్తున్నారు.
ఈ నెల 29న చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆ రోజు తెల్లవారుజామున 1.05 గంటల నుంచి 2.22 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. దీంతో 28వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 29వ తేదీ తెల్లవారుజామున 3 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. చంద్రగ్రహణం కారణంగా 28న సహస్ర దీపాలంకరణ సేవ, వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. శనివారం 87,081 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.4.05 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. మొత్తం 41,757 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. రద్దీ దృష్ట్యా అక్టోబర్ 1, 7, 8, 14, 15 తేదీల్లో సర్వదర్శనం టోకెన్లను నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
Big Breaking: బీజేపీకి కోమటిరెడ్డి రాజీనామా.. ఎల్లుండి కాంగ్రెస్‌లోకి..!