Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Asia Cup Babar Azam Becomes 1st Captain To Hit Highest Individual Score In Asia Cup

Asia Cup 2023: చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. విరాట్‌ కోహ్లీ రికార్డు బద్దలు!

Published Date :August 31, 2023 , 10:27 am
By Sampath Kumar
Asia Cup 2023: చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. విరాట్‌ కోహ్లీ రికార్డు బద్దలు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Babar Azam Beat Virat KohliRecord in PAK vs NEP Asia Cup 2023 Match: పాకిస్తాన్‌లోని ముల్తాన్ వేదికగా ఆసియా కప్ 2023 టోర్నీ ప్రారంభ మ్యాచ్ బుధవారం పాకిస్తాన్, నేపాల్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో 238 పరుగుల తేడాతో నేపాల్‌ను పాక్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్ సెంచరీతో చెలరేగాడు. 131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 151 పరుగులు చేశాడు. బాబర్‌కు ఇది వన్డే కెరీర్‌లో 19వ వన్డే సెంచరీ. సెంచరీతో చెలరేగిన బాబర్‌.. పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

ఆసియా కప్‌ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన కెప్టెన్‌గా బాబర్ ఆజమ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్‌, స్టార్‌ ప్లేయర్ విరాట్‌ కోహ్లి పేరిట ఉంది. కోహ్లీ అత్యధిక స్కోర్ 136. నేపాల్ మ్యాచ్‌లో 151 పరుగులు చేసిన బాబర్.. రికార్డుల రారాజు కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు.

వన్డేల్లో అత్యంత వేగంగా 19 సెంచరీలు చేసిన ఆటగాడిగా బాబర్‌ ఆజమ్ రికార్డు నెలకొల్పాడు. బాబర్‌ ఈ ఫీట్‌ను 102 ఇన్నింగ్స్‌లలో అందుకున్నాడు. అంతకముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ హషీమ్‌ ఆమ్లా పేరిట ఉండేది. ఆమ్లా 104 ఇన్నింగ్స్‌ల్లో 19 సెంచరీలు చేశాడు. తాజా మ్యాచ్‌తో ఆమ్లా రికార్డును ఆజమ్ బ్రేక్‌ చేశాడు.

Also Read: IND vs PAK: భారత్‌తో మ్యాచ్‌.. పాకిస్తాన్‌కు భారీ ఎదురుదెబ్బ!

అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో భారత్ మాజీ ఓపెనర్‌ గౌతమ్ గంభీర్‌ (5,238), ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ డామియన్ మార్టిన్‌ (5,346)ను బాబర్‌ ఆజమ్ అధిగమించాడు. ఇప్పటివరకు 102 ఇన్నింగ్స్‌లలో బాబర్‌ వన్డేల్లో 5,353 పరుగులు చేశాడు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Asia Cup 2023
  • Babar Azam
  • Babar Azam Record
  • PAK vs NEP
  • VIRAT KOHLI

తాజావార్తలు

  • Gudivada Software Engineer Murder: హర్యానాలో ఆంధ్ర సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దారుణ హత్య..

  • Nitish Kumar: ముగిసిన నితీష్ శకం.. నేడు ఎంపీగా ప్రమాణ స్వీకారం.. నెక్ట్స్‌ సీఎం ఇతడేనా?

  • Realme C100 4G: 8000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో.. కొత్త రియల్‌మీ ఫోన్ విడుదల

  • FIFA World Cup 2026: ఫుట్‌బాల్‌ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. టికెట్లను ధరలు భారీగా పెంచిన FIFA.. సామాన్యులకు దూరమేనా..?

  • Gold &Silver Rates: ఈ శుక్రవారం బంగారం, వెండి షాక్.. భారీగా పెరిగిన ధరలు

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions