సృష్టిలో విచిత్రాలకు లోటు లేదు.. ఈ మధ్యకాలంలో మనం తినే కూరగాయలు సాధారణంగా ఉండే బరువు కంటే ఎక్కువగా పండుతున్నాయి. క్యాబేజీ, పుచ్చకాయలు, గుమ్మడికాయలు సాధారణ బరువుకి మించి పెరుగుతున్నాయి. అనకాపల్లి జిల్లాలోని కూరగాయల మార్కెట్లో ఓ కంద అందరి దృష్టినీ ఆకర్షించింది.
పట్టణంలోని కూరగాయల మార్కెట్లో ఓ రైతు తెచ్చిన కంద 12 కేజీల బరువు తూగింది. ఈ కందను అంతా ఆసక్తిగా గమనించారు. సాధారణంగా కంద రెండు నుంచి నాలుగు కేజీల వరకు బరువు ఉంటుంది. అనకాపల్లిలోని కూరగాయల మార్కెట్ కు సోమవారం 12 కేజీల బరువు కలిగిన భారీ కంద అమ్మకానికి వచ్చింది. దీనిని చూసేందుకు పలువురు ఆసక్తి చూపారు. బాబోయ్.. బాహుబలి కంద అంటూ కొందరు కామెంట్ చేయడం కనిపించింది. ఇప్పుడు కంద కూడా ఆ రైతుకు మంచి ఆదాయం తెచ్చిపెట్టింది. వాతావరణంలో మార్పులు, నేలలో పోషకాల కారణంగా ఇలాంటి కంద పెరుగుతుందని రైతులు అంటున్నారు.
Read Also: Samsung India: ‘శామ్‌సంగ్ ఇండియా’ ఖుషీ ఖుషీ. గత ఐదేళ్లలో ఎప్పుడూలేనంత..
మొత్తం మీద ఈ బాహుబలి కంద దీపావళి వేళ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. కందను సాదాసీదా అని తీసిపారేయలేం. కందలో పుష్కలంగా పోషకాలు ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇది ఆరోగ్యాన్ని క్రమబద్ధీకరిస్తుంది. ఇది కాన్సర్‌ను అడ్డుకునే శక్తి కూడా ఈ కందకు వుంటుంది. కంద గుండె సమస్యలకు చెక్ పెడుతుందని తేలింది. మీ బాడీలోని కొలెస్ట్రాల్ తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కంద రుచి కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఫ్రై చేసుకొని కూడా తింటుంటారు. ఏపీలోని కోస్తా తీరంలో భారీ చేపలు కూడా మత్స్యకారులకు దొరుకుతూ ఉంటాయి. ఆ చేపలు వేలల్లో ధర పలుకుతూ వుంటాయి. ఈ వేలంతో మత్స్యకారులకు భారీ ఆదాయం లభిస్తూ ఉంటుంది. పులసచేపల గురించి ఎంత చెప్నినా తక్కువే. సముద్రంలో, గోదావరిలో దొరికే భారీ పులసలతో లక్షాధికారులు అవుతుంటారు మత్స్యకారులు.
Read Also: Kerala: కేరళలో గవర్నర్ వర్సెస్ సీఎం.. సాయంత్రం హైకోర్టు విచారణ..