Axar Patel: “రెండు సార్లు ఫోన్ చేస్తే నేను ఎత్తలేదు”.. రిషభ్ పంత్ రీఎంట్రీపై అక్షర్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Axar Patel: ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆల్‌రౌండర్, కెప్టెన్ అక్షర్ పటేల్.. స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ పునరాగమనంపై ఓ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీకి సంబంధించిన వీడియోని ఢిల్లీ క్యాపిటల్స్ తన అధికారిక హ్యాండిల్లో పోస్ట్ చేసింది. ట్రేడింగ్ ద్వారా రిషభ్ పంత్ మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంత్ స్వయంగా తనకు ఫోన్ చేసి తనతో మాట్లాడిన సంభాషణను అక్షర్ పటేల్ ఓ వీడియోలో వివరించాడు.
“అతనిపై నాకు ఉన్న ప్రేమే అతడిని తిరిగి ఢిల్లీకి లాక్కొచ్చింది” అంటూ అక్షర్ పటేల్ తన మాటలను ప్రారంభించాడు. ఈ డీల్ ఓకే అయిన తర్వాత పంత్ నుంచి తనకు మొదటిసారి కాల్ వచ్చినప్పుడు.. తాను బాబుతో గడుపుతూ ఫోన్‌ను పక్కన పెట్టేయడం వల్ల లిఫ్ట్ చేయలేకపోయానని అక్షర్ చెప్పాడు. పంత్ రెండోసారి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదట. ఆ తర్వాత రాత్రి వేళ బాబు పడుకున్నాక, అక్షర్ పటేల్ తిరిగి పంత్‌కు ఫోన్ చేసి.. “భాయ్.. ఏమైంది? ఏమైనా అర్జెంట్ మ్యాటరా?” అని అడిగాడు. దానికి పంత్ ఎంతో సంతోషంగా.. “భాయ్.. అంతా కన్ఫర్మ్ అయిపోయింది, నేను మళ్లీ ఢిల్లీకి తిరిగి వచ్చేస్తున్నాను” అని సమాధానమిచ్చాడట. ఆ సమయంలో వారిద్దరి మధ్య జరిగిన మొదటి సంభాషణ ఇదేనని, ఆ తర్వాత ఇద్దరూ ఎంతో సాధారణంగా మాట్లాడుకున్నారని అక్షర్ ఆ వీడియోలో తెలిపాడు. పంత్ కూడా “చివరికి నేను మళ్లీ నా సొంత గూటికి (హోమ్) వచ్చేస్తున్నాను” అని సంతోషం వ్యక్తం చేసినట్లు చెప్పాడు. అయితే ఆ సమయంలో తన మనసులో ఒక మాట అనుకున్నానని, కానీ దానిని పంత్‌కు చెప్పలేదని అక్షర్ ఎమోషనల్ అయ్యాడు. “ఉదయం దారి తప్పిన వాడు సాయంత్రానికి మళ్లీ ఇంటికి తిరిగి వస్తే, అతడిని దారి తప్పిన వాడు అనరు” అనే సామెతను అక్షర్ గుర్తుచేసుకున్నాడు. తమ ఇద్దరి మధ్య ఉన్న బలమైన స్నేహ బంధమే పంత్‌ను మళ్లీ ఢిల్లీ వైపు అడుగులు వేసేలా చేసిందని అక్షర్ పటేల్ అన్న మాటలు ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానుల మనసులను గెలుచుకుంటున్నాయి.
Also Read
- MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
- Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
- Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
- Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
"Bhai, main wapas aa raha hun." 🥹
Bapu & the whole of Dilli waited to hear just that 💙❤️ pic.twitter.com/5k1nDtNUTM
— Delhi Capitals (@DelhiCapitals) June 23, 2026
తాజావార్తలు
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
-
Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
-
Sri Veerabhadra Swamy Temple: శివయ్య వీరభద్రుడిగా వెలసిన 1500 ఏళ్ళ బ్రహ్మసూత్ర శివాలయం
-
Ganja Smuggling Busted: ఒడిశా టు హైదరాబాద్.. గంజాయి స్మగ్లింగ్‌కు చెక్..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!