అమెజాన్ వెబ్ సర్వీస్ (AWS) మంగళవారం హైదరాబాద్‌లో భారతదేశంలోని రెండవ డేటా సెంటర్ క్లస్టర్‌ను నిర్మించడానికి 2030 నాటికి $4.4 బిలియన్ల (సుమారు రూ. 36,300 కోట్లు) పెట్టుబడిని ప్రకటించింది. గ్లోబల్ ప్లేయర్‌ల కోసం ఎంచుకున్న పెట్టుబడి గమ్యస్థానంగా కాకుండా, భారతదేశంలోని డేటా సెంటర్ హబ్‌గా తెలంగాణ స్థానానికి మరో ధ్రువీకరణలో, అమెజాన్ కంపెనీకి చెందిన అమెజాన్ వెబ్ సర్వీస్ (AWS) తన రెండవ ఎడబ్ల్యూఎస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రీజియన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది అమెజాన్. భారతదేశంలో ఎడబ్ల్యూఎస్ ఆసియా పసిఫిక్ (హైదరాబాద్) ప్రాంతంగా పేరు పెట్టారు. ఎడబ్ల్యూఎస్ కొత్త ఆసియా పసిఫిక్ (హైదరాబాద్) రీజియన్ ద్వారా 2030 నాటికి భారతదేశంలో $4.4 బిలియన్ల (దాదాపు రూ.36,300 కోట్లు) పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది.
Also Read : Mallareddy IT Raids : రెండో రోజు కొనసాగాతున్న ఐటీ సోదాలు.. షిఫ్ట్స్ వైజ్‌గా ఐటీ అధికారుల తనిఖీలు
ఇందులో డేటా సెంటర్‌ల నిర్మాణంపై మూలధన ఖర్చులు, కొనసాగుతున్న యుటిలిటీలకు సంబంధించిన కార్యాచరణ ఖర్చులతో పాటు సౌకర్యాల ఖర్చులు ఉంటాయి. పెట్టుబడి ఈ కాలంలో బాహ్య వ్యాపారాలలో సంవత్సరానికి సగటున 48,000 కంటే ఎక్కువ ఫుల్ టైం ఉద్యోగాల కల్పింన ఉంటుందని అంచనా వేయబడింది. ఈ ఉద్యోగాలు భారతదేశంలో నిర్మాణం, సౌకర్యాల నిర్వహణ, ఇంజనీరింగ్, టెలికమ్యూనికేషన్స్ మరియు దేశ విస్తృత ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగాలతో సహా ఎడబ్ల్యూఎస్ సరఫరా చైన్ సిస్టంలో భాగంగా ఉంటాయి. ఎడబ్ల్యూఎస్ ఆసియా పసిఫిక్ (హైదరాబాద్) రీజియన్ నిర్మాణం, నిర్వహణ కూడా 2030 నాటికి భారతదేశ స్థూల జాతీయోత్పత్తికి సుమారుగా $7.6 బిలియన్లు (సుమారు రూ.63,600 కోట్లు) ఉండవచ్చని అంచనా వేయబడింది.