Cyberabad CP: సైబరాబాద్ లో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య పెరిగింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబరాబాద్ పరిధిలో గతేడాది తో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య పెరిగిందని కమిషనర్ ఆఫ్ పోలీస్ అవినాష్ మహంతి తెలిపారు. గతేడాది 27, 322 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 29, 156 కేసులు రిజిస్ట్రల్ అయ్యాయి.. మహిళలపై నేరాలు తగ్గాయి.. ఈ ఏడాది 105 హత్య కేసులు నమోదు కాగా, సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయి.. గతేడాది 4, 850 కేసులు నమోదు కాగా 5, 342 సైబర్ క్రైమ్ కేసులు రికార్డ్ అయ్యాయి.. ఈ ఏడాది 3432 మందికి శిక్షలు ఖరారు అయినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక, 5342 సైబర్ క్రైమ్ కేసులు, సైబర్ క్రైమ్ ద్వారా 232 కోట్లు మాయం అయ్యాయి.. సైబర్ క్రైమ్ లో 46 కోట్లు రికవరీ చేశాం.. 277 డ్రగ్స్ కేసులు నమోదు,567 మంది అరెస్ట్ చేశామని సీపీ అవినాష్ మహంతి చెప్పుకొచ్చారు.
Read Also: Salaar: ‘సలార్’ నాన్ RRR రికార్డ్… నైజాం కింగ్!
Also Read
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
- Virat Kohli - Rohit Sharma: కోహ్లీ-రోహిత్‌కు అగ్నిపరీక్ష.! రాణిస్తే వరల్డ్‌కప్.. విఫలమైతే కెరియర్ ముగిసినట్లేనా?
- IND W vs ENG W: వరల్డ్‌కప్ ముందు టీమిండియాకు డేంజర్ బెల్.. ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమి.!
- Israel Lebanon Ceasefire: బిగ్ రిలీఫ్.. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, లెబనాన్ గ్రీన్ సిగ్నల్!
డ్రగ్స్ కేసుల్లో ఇద్దరిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు. 6, 676 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నాం.. డ్రగ్స్ కేసుల్లో 27 కోట్లు విలువ చేసే మత్తు పదార్ధులను అదుపులోకి తీసుకున్నాం.. 52, 124 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి.. ట్రాఫిక్ ఉల్లంఘనల ద్వారా 104 కోట్ల రూపాయల చలాన్ లు విధించాం.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన 24, 318 మంది డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేశామని ఆయన చెప్పారు. షీ టీమ్స్ ద్వారా 2, 587 మంది అరెస్ట్ చేశాం.. 52 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని సీపీ తెలిపారు.
Read Also: Mansoor Ali Khan: నువ్వు చేసిందే తప్పు… పోనిలే అని వదిలేస్తే ఎక్స్ట్రాలా… ఆ మాత్రం జరగాల్సిందేలే
ఈ ఏడాది 277 డ్రగ్ కేసులు నమోదు కాగా అందులో 567 మందిని అరెస్టు చేశామని సీపీ మహంతి తెలిపారు. ఇందులో ఇద్దరు సప్లయర్స్, 550 మంది పెడ్లర్స్ ఉన్నారు.. 6, 676 కిలోల గంజాయి, 13 లీటర్ల హాషిష్ ఆయిల్, 507 గ్రాముల కొకైన్, 261 గ్రాముల ఎండీఎంఏ, 120 గ్రాముల ఆల్ప్రోజోలం, 26 కిలోల ఛరస్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. 52, 124 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు కాగా, 1271 మంది కి శిక్ష విధించాం.. ఛలాన్ల కింద 104 కోట్ల 54 లక్షల , 12 వేల పై చిలుకు వసూలు చేశాం.. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కింద 1347 ఆపరేషన్స్ చేసి 1829 చిన్నారుల రెస్క్యూ చేశామని ఆయన వెల్లడించారు. ఇక, కేపీ చౌదరి కేసులో దర్యాప్తు కొనసాగుతుంది.. చౌదరి కన్ఫెషన్ లో అతను చెప్పిన ప్రతి ఒక్కరిని విచారిస్తున్నాం.. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చాము.. కమర్షియల్ ఈవెంట్ కు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.. గైడ్ లైన్స్ పాటించాలి అని సీపీ అవినాస్ మహంతి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Nissan Tecton SUV: నిస్సాన్ టెక్టన్ SUV జూలై 9న ఆవిష్కరణ.. ప్రీమియం ఫీచర్లతో క్రెటా, సెల్టోస్‌కు గట్టి పోటీ
-
Dhurandhar 2: ఈ రోజు ఓటీటీలోకి స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’… ప్రశంసలు కురిపించిన అంబానీ.!
-
Vaibhav-MS Dhoni: ఎంఎస్ ధోనీ కాదు బిహార్‌కు గుర్తింపు వైభవ్ వల్లే.. ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Bank Account: ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉండొచ్చు? ఎక్కువ ఖాతాలు ఉంటే లాభమా? నష్టమా?
-
Aadhaar Mobile Number Update: ఆధార్‌లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!