Man Fakes Kidnapping: ప్రేమకు హద్దులు లేవని చాలా మంది అంటుంటారు. లవ్‌బర్డ్‌లు ఒకరితో ఒకరు సమయం గడపడానికి ఎంతకైనా తెగించే సందర్భాలు కూడా మనకు కనిపిస్తాయి. చాలా మంది ట్యూషన్ నుంచి తప్పించుకుని తల్లిదండ్రులకు అబద్ధం చెప్పి కలుస్తూ ఉంటారు. చాలా మంది వ్యక్తులు తమ భాగస్వాములతో ప్రత్యేక సందర్భాలను గడపాలని కోరుకుంటారు. ఆస్ట్రేలియాకు చెందిన ఒక వ్యక్తి తన నూతన సంవత్సర వేడుకలను తన భార్యతో గడపడానికి ఇష్టపడలేదు. తను ఇష్టపడిన ప్రియురాలితో గడపాలని అనుకున్నాడు. దీని కోసం ఓ ప్రణాళికను రచించాడు. తన భాగస్వామికి బదులు ప్రియురాలితో గడిపేందుకు తన సొంత కిడ్నాప్ కథను రూపొందించాడు. కానీ చివరికి చిక్కుల్లో పడ్డాడు.
35 ఏళ్ల పాల్ ఐరా తన ప్రేమికురాలైన మరో మహిళతో నూతన సంవత్సర వేడుకలను గడపడానికి కిడ్నాప్ నాటకాన్ని ఆడాడు. ఆ వ్యక్తి డిసెంబర్ 31న తన ఆర్థిక సలహాదారుడిని కలవడానికి వెళ్తున్నానని భార్యకు చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం తనను ఓ సెక్స్ వర్కర్ కిడ్నాప్ చేశాడని తన భార్యకు మెస్సేజ్ పంపించాడు. దానిని నమ్మి ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఊహించని విధంగా, అతను రాత్రిపూట బ్యాగ్‌తో తన ప్రేమికురాలి ఇంట్లోకి ప్రవేశించడాన్ని వారు కనుగొన్నారు.
Harassment: ఏంట్రా ఇది.. ఆరేళ్ల బాలుడిపై మైనర్ లైంగిక దాడి
మరుసటి రోజు ఇంటికి రావడానికి పాల్ ఐరా మరో ఉపాయం ఆలోచించాడు. తన తండ్రికి ఫోన్ చేసి అతనిని కిడ్నాపర్లు తనను కారులో వదిలివేస్తారని చెప్పాడు. అతనిని తన ప్రేమికురాలు వాహనంలో దింపిన తర్వాత ఒంటరిగా తిరిగి వచ్చాడు. ఆ వ్యక్తి తన సొంత కిడ్నాప్ గురించి కథను రూపొందించినట్లు న్యూసౌత్‌వేల్స్ పోలీసులు నిర్ధారించారు. నకిలీ కేసును దర్యాప్తు చేయడంలో వ్యక్తి తమ సమయాన్ని గంటల తరబడి వృధా చేశాడని, ఆర్థిక వనరులను కూడా వృధా చేశాడని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సమయాన్ని వృధా చేసినందుకు అతనిని అరెస్ట్ చేశారు. ఈ కేసును మేజిస్ట్రేట్ చాలా వింతగా అభివర్ణించారు. ఐరాకు బెయిల్ మంజూరు చేయబడింది. ఈ నెలాఖరులో ఆయన తిరిగి కోర్టుకు హాజరు కానున్నారు.