AUS vs IND: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. భారత్ మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం!
- న్యూజిలాండ్‌కు టెస్టు సిరీస్ కోల్పోయిన భారత్
- నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియా సిరీస్
- భారత్ మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ కోల్పోయిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై సిరీస్ కోల్పోవడమే కాకుండా.. వైట్ వాష్ ఇవ్వడంతో భారత జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. కివీస్ టెస్ట్ సిరీస్ ఘోర వైఫల్యం నేపథ్యంలో టీమిండియా మేనేజ్‌మెంట్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ క్రమంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమ్ మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాటర్లు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్‌లను వారం ముందుగానే కంగారో గడ్డపైకి పంపనుంది.
న్యూజిలాండ్ సిరీస్‌లోని మొదటి టెస్టులో ఆడిన కేఎల్ రాహుల్ పూర్తిగా నిరాశపరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో 12 రన్స్ చేశాడు. గిల్ అందుబాటులోకి రావడం, పేలవ ఫామ్ కారణంగా.. మిగితా రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024కి ఎంపికైన రాహుల్.. ప్రాక్టీస్ కోసం ముందుగానే ఆస్ట్రేలియా గడ్డపై అడగుపెట్టనున్నాడు. నవంబర్ 7 నుంచి ఆస్ట్రేలియా-ఎతో జరగనున్న రెండో టెస్టులో రాహుల్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో 5 టెస్టులు ఆడిన రాహుల్.. 187 పరుగులు మాత్రమే చేశాడు. ప్రస్తుతం తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో రాహుల్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందో లేదో చూడాలి.
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
- Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
- INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
Also Read: Virat Kohli Birthday: 2006లో చిన్న పిల్లాడు.. ఇప్పుడు క్రికెట్ దిగ్గజం!
యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ తొలిసారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నాడు. విదేశీ గడ్డపై ఆడిన అనుభవం జురెల్‌కు లేకపోవడంతో అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ముందుగానే ఆస్ట్రేలియాకు పంపిస్తోంది. జురెల్ కూడా ఆస్ట్రేలియా-ఎతో జరగనున్న రెండో టెస్టులో ఆడనున్నాడని తెలుస్తోంది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకం అన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
-
Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
-
Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
-
Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు