Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aus vs Ban: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ప్రపంచ క్రికెట్లో అగ్రశ్రేణి జట్టుగా పేరొందిన ఆస్ట్రేలియా ఊహించని రీతిలో కుప్పకూలింది. ఢాకాలోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో కంగారూల బ్యాటింగ్ పూర్తిగా విఫలమవడంతో అరుదైన చెత్త రికార్డు వారి ఖాతాలో చేరింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆ నిర్ణయం ఆ జట్టుకు పెద్ద షాక్‌గా మారింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బంగ్లాదేశ్ పేసర్లు టాస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్ అద్భుత బౌలింగ్‌తో ఆసీస్ టాప్ ఆర్డర్‌ను చిత్తు చేశారు.
పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు:
ఓపెనర్లు మాథ్యూ షార్ట్, కూపర్ కానోలీ తొలి రెండు ఓవర్లలోనే డకౌట్‌గా వెనుదిరిగారు. అనంతరం క్రీజులోకి వచ్చిన మ్యాట్ రెన్షా కూడా ఐదు బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా రెండు ఓవర్లు పూర్తయ్యేసరికి ఒక్క పరుగు కూడా చేయకుండా మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా ముస్తాఫిజుర్ రెహమాన్ వరుసగా రెండు వికెట్లు తీసి ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టాడు.
Also Read
- KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
- Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
ఆసీస్ పేరిట చెత్త రికార్డు:
ఈ మ్యాచ్‌లో ఎదురైనా బ్యాటింగ్ వైఫల్యంతో ఆస్ట్రేలియా వన్డే క్రికెట్ చరిత్రలో అరుదైన అవమానకర రికార్డును నమోదు చేసింది. వరుసగా నాలుగు వన్డే ఇన్నింగ్స్‌ల్లో ఓపెనింగ్ భాగస్వామ్యం పరుగుల ఖాతా తెరవకుండానే ముగిసిన జట్టుగా నిలిచింది. ప్రపంచ క్రికెట్లో అత్యంత బలమైన జట్లలో ఒకటైన ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ వంటి జట్టుపై ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.
దారుణ ఫామ్‌లో ఆసీస్ బ్యాటర్లు:
ఈ ఏడాది వన్డేల్లో ఆస్ట్రేలియా బ్యాటర్ల ప్రదర్శన తీవ్ర నిరాశ కలిగిస్తోంది. ఇప్పటివరకు జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన జోష్ ఇంగ్లిస్ కూడా ఐదు మ్యాచ్‌ల్లో కేవలం 159 పరుగులు మాత్రమే చేశాడు. అలెక్స్ క్యారీ సగటు 23.25గా ఉండగా, మాథ్యూ షార్ట్ సగటు కేవలం 14 మాత్రమే. మరోవైపు మార్నస్ లబుషేన్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 25 పరుగులు మాత్రమే చేసి 6.25 సగటుతో తీవ్రంగా నిరాశపరిచాడు.
ఆస్ట్రేలియా బ్యాటింగ్ వైఫల్యం సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ క్రికెట్లో బలమైన జట్టుగా పేరున్న కంగారూలు పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు కోల్పోవడంతో నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న ఆస్ట్రేలియా జట్టు, ఈ ప్రదర్శనతో మరింత విమర్శలను ఎదుర్కొంటోంది. రాబోయే మ్యాచ్‌ల్లో జట్టు ఎలా పుంజుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Matthew Short – 0(4) ❌
Cooper Connolly – 0(1) ❌
Matt Renshaw – 0(5) ❌AUSTRALIA 3 DOWN FOR 0 RUNS IN 2 OVERS vs BANGLADESH 🤯 pic.twitter.com/oCwsrkmg7v
— Johns. (@CricCrazyJohns) June 11, 2026
తాజావార్తలు
-
JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
-
Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
-
Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!