మహిళలు, యువతుల పట్ల పోకిరీల వేధింపులు ఎక్కువైపోతున్నాయి. అందరు చూస్తుండగానే వేధిస్తున్నారు కొందరు వ్యక్తులు. అసభ్యంగా ప్రవర్తించడం, వెకిలి చేష్టలతో రెచ్చిపోతున్నారు. ఇదే రీతిలో బైక్ పై వెళ్తున్న యువకులు ఓ యువతికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. ఇది గమనించిన యువతి, కుటుంబసభ్యులు ఆ యువకులను అడ్డగించి పొట్టుపొట్టు కొట్టారు. ధార్ జిల్లాలోని అమ్ఝేరాలో ఫ్లయింగ్ కిస్ విషయంలో వివాదం చెలరేగింది. అమ్మాయి కుటుంబం బైక్ ఆపి యువకుడిని కొట్టింది. దీనితో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ జరిగింది. ఈ మొత్తం సంఘటన సమీపంలోని CCTV కెమెరాలో రికార్డైంది. నెట్టింటా వైరల్ గా మారింది. ఈ సంఘటన అమ్జెరా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగింది. బైక్ పై వెళ్తున్న ఒక యువకుడు ఒక యువతికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు.
వెంటనే, ఆ మహిళ, ఆమె సహచరులు బైక్ ఆపి నిందితుడిని, అతని స్నేహితులను కొట్టడం ప్రారంభించారు. తరువాత, నిందితుడైన యువకుడు తన మనుషులను పిలిచి బాధితుల కుటుంబంపై దారుణంగా దాడి చేశాడు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న అమ్జెరా పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని చర్యలు తీసుకున్నారు. రెండు వర్గాల ఫిర్యాదుల ఆధారంగా, అమ్జెరా పోలీసులు 15 మందిపై కేసు నమోదు చేశారు. ఈ ఘర్షణకు సంబంధించిన వైరల్ వీడియోను సాక్ష్యంగా తీసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.