విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్ ముఖ ద్వారం దగ్గర మత్స్యకారులకు తెలుగుదేశం పార్టీ భరోసా బహిరంగ సభలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాద ఘటన దురదృష్టకరం.. అధికారంలో ఉన్నా లేకపోయినా,మత్స్యకారులను ఎప్పుడూ ఆదుకునేది టీడీపీయే.. బోట్లు కాలిపోయిన వారికి లక్ష రూపాయలు, పాక్షికంగా బోట్లు కాలిపోయిన వారికి రూ. 50 వేలు ఇస్తున్నాం.. జీవనోపాధి కోల్పోయన బాధితులను ఆదుకుంటున్నాం.. మత్స్యకారులను అన్ని విధాలుగా ఆదుకోవడంలో వైసీపీ సర్కార్ విఫలం అయింది అని ఆయన చెప్పుకొచ్చారు. టీడీపీ స్పందించిన తర్వాతే ఈ కుంభకర్ణుడు స్పందించాడు.. తుఫాన్ బాధితులను చంద్రబాబు పరామర్శిస్తుంటే.. జగన్ ఇప్పుడు నిద్ర లేచాడు అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
Read Also: Heart Attack: దేశంలో 12.5% పెరిగిన గుండెపోటు మరణాలు.. కారణం ఏమిటంటే..!?
బాధితులకు ప్రభుత్వం ఆదుకోవడంలో పూర్తిగా విఫలం అయింది అని అచ్చెన్నాయుడు అన్నారు. అగ్నిప్రమాదం ఘటనపై మొదట స్పందించి ఆర్ధిక సహాయం చేసింది జనసేన పార్టీ.. టీడీపీ- జనసేన ఒకటి అయ్యాయి.. ఈ రెండు పార్టీలు మీవి.. ఈ రెండు పార్టీలను ప్రజలు ఆదరించాలి.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ- జనసేన పార్టీలు అధికారంలోకి వస్తాయి.. అప్పుడు బాధితులకు కొత్త బోట్లు కొని ఇస్తామని ఆయన చెప్పారు. పేరుకే కార్పొరేషన్లు.. ఒక్క లోన్ కూడా ఇవ్వలేదు.. వీటి వలన ఎవరికీ ఉపయోగము లేదు అని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు తెలిపారు.