Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Atchannaidu Said That Mahanadu Is Grand Success

Atchannaidu: మహానాడు గ్రాండ్ సక్సెస్.. చరిత్రలో నిలిచిపోతుంది

Published Date :May 29, 2022 , 10:16 pm
By Ramesh Nalam
Atchannaidu: మహానాడు గ్రాండ్ సక్సెస్.. చరిత్రలో నిలిచిపోతుంది
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఒంగోలులో నిర్వహించిన మహానాడు గ్రాండ్ సక్సెస్ సాధించిందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా లెక్కచేయకుండా ప్రజలు స్వచ్ఛందంగా మహానాడుకు తరలివచ్చారని ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఏ మాత్రం వ్యతిరేకత ఉందో మహానాడుతో తేలిపోయిందని అచ్చె్న్నాయుడు పేర్కొన్నారు. మహానాడును విజయవంతం చేసిన వారందరికీ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. మహానాడు నిర్వహణకు స్థలం ఇచ్చి సహకరించిన మండువవారిపాలెం రైతులకు పాదాభివందనం చేస్తున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ఒంగోలు సమీపంలో నిర్వహించిన మహానాడు చరిత్రలో నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంపై యువత, మహిళల్లో తిరుగుబాటు మొదలైందని ఆయన అభిప్రాయపడ్డారు.

Minister Jayaram: మీసం మెలేసి చెబుతున్నా.. బాలయ్య తాట తీస్తాం

మరోవైపు టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బస్సులు ఆపించినా, టైర్లలో గాలి తీయించినా మహానాడు విజయవంతం కావడం శుభపరిణామం అన్నారు. మహానాడు వేదికగా టీడీపీ నేతల ప్రశ్నలకు జవాబులు చెప్పలేక ఫ్రస్టేషన్‌లో మంత్రులు ఏదేదో మాట్లాడుతున్నారని ఆమె చురకలు అంటించారు. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై మంత్రి రోజా అవగాహనరాహిత్యంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రోజా మంత్రిగా కాకుండా నటిగానే మాట్లాడుతుండటం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై బహిరంగ చర్చకు రావాలని మంత్రి రోజాకు వంగలపూడి అనిత సవాల్ విసిరారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • atchannaidu
  • mahanadu 2022
  • Telugu Desam Party

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions