Asthma Remedies: ఆస్తమా అనేది తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి. దీని వల్ల శ్వాసనాళంలో కాస్త వాపు వస్తుంది. చలికాలం వచ్చిందంటే పెద్దవాళ్లే కాదు.. చిన్న పిల్లలు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఊపిరి ఆడకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, ఇంకా ఛాతీ నొప్పి ఆస్తమా ప్రధాన లక్షణాలు. ఆస్తమా సరిగ్గా చికిత్స చేయకపోతే, దాని లక్షణాలు పెరుగుతాయి. ఇకపోతే ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని సులభమైన ఆయుర్వేద చర్యలను అనుసరించడం ద్వారా ఆస్తమా లక్షణాలను నియంత్రించవచ్చు. ఆస్తమా చికిత్సలో సహాయపడే ఆయుర్వేద నివారణలు మనం కొన్ని చూద్దాం.
Read Also: DaDa : తెలుగులో ‘పా.. పా..’గా రాబోతున్న తమిళ బ్లాక్ బస్టర్ ‘డా..డా
తులసి:
తులసిలో కఫాన్ని తొలగించే గుణాలు ఉన్నాయి. దీన్ని తీసుకోవడం వల్ల శ్వాసనాళంలో పేరుకుపోయిన కఫం తొలగిపోయి శ్వాసకోశ వాపు కూడా తగ్గుతుంది. రోజు 5 నుండి10 తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి గోరువెచ్చగా అయ్యాక అందులో తేనె కలుపుకుని తాగాలి. రోజుకు ఒకటి లేదా రెండుసార్లు తాగడం వల్ల దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే గొంతులో పేరుకుపోయిన కఫం తొలగిపోతుంది. తులసి ప్రయోజనాలను పొందడానికి మీరు నేరుగా తులసి ఆకులను కూడా తినవచ్చు. ప్రతిరోజూ కొన్ని తులసి ఆకులను నమలడం ద్వారా కూడా ఉపశమనం పొందవచ్చు.
అల్లం:
అల్లం సాధారణంగా ప్రతి ఇంట్లో వాడతారు. కొందరు దీనిని టీలో ఉపయోగిస్తే మరికొందరు కూరగాయల రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. ఆయుర్వేదం ప్రకారం ఇది కఫం తగ్గించడానికి ఖచ్చితంగా ఒక ఔషధంగా పని చేస్తుంది. ఇది ముఖ్యంగా ఆస్తమా రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అల్లం శ్వాసకోశ నాళాలను విస్తరించడంలో కూడా సహాయపడుతుంది. ఇది శ్వాస సమస్యలలో ఉపశమనం అందిస్తుంది. అల్లం టీ తాగే సమయంలో కాస్త తేనె, నిమ్మరసం మిక్స్ చేసి తాగాలి. మీరు ఈ టీని రోజుకు ఒకటి లేదా రెండుసార్లు త్రాగవచ్చు. దీని వల్ల ఊపిరితిత్తుల సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఉబ్బసం లక్షణాల నుండి ఉపశమనం పొందడానికి తాజా అల్లం రసం త్రాగాలి. అల్లం రసంలో తేనె కలిపి తాగితే త్వరగా ఉపశమనం లభిస్తుంది.
Read Also: Pushpa2 TheRule : పుష్ప 2 హైదరాబాద్ ఈవెంట్ వేదిక మారే అవకాశం..?
మూలేతి (అతిమధురం):
ఆయుర్వేదం ప్రకారం మూలేతి దగ్గుకు అద్భుతమైన ఔషధం. ఇది గొంతులో కఫం పేరుకుపోకుండా చేస్తుంది. ములేతికి దగ్గును తగ్గించే గుణాలు ఉన్నాయి. ఇది రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది గొంతులో కఫం పేరుకుపోకుండా నిరోధించి, దగ్గు నుండి త్వరగా ఉపశమనం పొందుతుంది. తేనె లేదా గోరువెచ్చని నీళ్లలో మూలేతి పౌడర్ కలిపి తాగడం వల్ల ఊపిరితిత్తుల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.