Assam Love Jihad Bill: అస్సాం ప్రభుత్వం రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో “లవ్ జిహాద్”, బహుభార్యత్వాన్ని అరికట్టడానికి కొత్త బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. ఈసందర్భంగా ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో లవ్ జిహాద్, బహుభార్యత్వం వంటి అంశాలను పరిష్కరించే అనేక ముఖ్యమైన బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెడుతుందని చెప్పారు. మంత్రివర్గం వాటిని ఆమోదించిన తర్వాత వివరాలను అందిస్తామని సీఎం పేర్కొన్నారు.
READ ALSO: Russia Nuclear Drills: అమెరికాతో మీటింగ్ క్యాన్సిల్.. అణు ప్రయోగాలకు దిగిన రష్యా!
బుధవారం (అక్టోబర్ 22) నాగాంవ్‌లో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం శర్మ విలేకరులతో మాట్లాడారు. ఈ ముసాయిదా బిల్లులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం లభించిన తర్వాత వాటి వివరాలను పంచుకుంటామని ఆయన స్పష్టం చేశారు. “రాబోయే అస్సాం అసెంబ్లీ సమావేశాల్లో ‘లవ్ జిహాద్’, బహుభార్యత్వం, సత్రాల (వైష్ణవ మఠాలు) రక్షణ, టీ తోటలలో పనిచేసే గిరిజన ప్రజలకు భూమి హక్కులు వంటి అంశాలపై కొన్ని ముఖ్యమైన, చారిత్రాత్మక బిల్లులను ప్రవేశపెడతామని అన్నారు. రాష్ట్రంలో సామాజిక సంస్కరణలు, సాంప్రదాయ సంస్థల రక్షణను నిర్ధారించడం ఈ కొత్త బిల్లుల లక్ష్యం అని సీఎం చెప్పారు. అయితే ఈ కొత్త బిల్లుల్లో ఏ నిబంధనలు ఉంటాయో ఆయన వెల్లడించలేదు.
జుబీన్ గార్గ్ మరణంపై సీఎం స్పందన?
దివంగత గాయకుడు జుబీన్ గార్గ్ మరణంపై సీఎం స్పందించారు. సీఎం మాట్లాడుతూ.. జుబీన్ గార్గ్ మరణాన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. జుబీన్ గార్గ్ అనుచరులుగా నటిస్తూ కొందరు రాష్ట్రంలో ఉద్రిక్తత సృష్టించడానికి ప్రయత్నిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంతరాలు రాకుండా, ఒకవేళ వచ్చిన వాటి నుంచి రక్షించడానికి బీజేపీ నిజమైన అనుచరులందరినీ ఏకం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన స్పష్టం చేశారు. జుబీన్ గార్గ్ మరణం అస్సాం ప్రజలకు అత్యంత విషాదకరమైన వార్త అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అయితే ఒక వర్గం ప్రజలు దీనిని రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించారని చెప్పారు. ఆయన మరణం తర్వాత, కొందరు వ్యక్తులు ఆయన భావజాలాన్ని వేరే దిశలో తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.
READ ALSO: Mosquito Free Country: ఇక్కడ ఒక్క దోమ కూడా ఉండదు! ప్రపంచంలో దోమలు లేని ఏకైక దేశం ఏంటో తెలుసా?
The next Assembly session will be historic as many significant bills will be introduced – bill to ban polygamy and Love Jihad, Bill to preserve our Satras, bill to confer land rights to our tea garden workers among others. pic.twitter.com/iEyLPXWeIr
— Himanta Biswa Sarma (@himantabiswa) October 22, 2025