Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Asia Cup Asia Cup Top 5 Records In T20 Format Centuries Wickets And Partnerships All Are Name For India

Asia Cup 2025: ఆసియా కప్ టాప్ 5 రికార్డులు.. సెంచరీలు, వికెట్స్, భాగస్వామ్యాలు అన్నీ మనవే!

Published Date :September 9, 2025 , 4:25 pm
By Sampath Kumar
  • నేటి నుంచే ఆసియా కప్ 2025 ప్రారంభం
  • కోహ్లీ నుంచి భువీ వరకు రికార్డులు
  • ఆసియా కప్ టాప్ 5 రికార్డులు ఇవే
  • సెంచరీలు, వికెట్స్, భాగస్వామ్యాలు అన్నీ మనవే
Asia Cup 2025: ఆసియా కప్ టాప్ 5 రికార్డులు.. సెంచరీలు, వికెట్స్, భాగస్వామ్యాలు అన్నీ మనవే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఆసియా కప్ 2025 నేటి నుంచే ప్రారంభం కానుంది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నమెంట్.. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ మధ్య జరిగే మ్యాచ్‌తో మొదలవనుంది. వచ్చే ఏడాది భారత్, శ్రీలంకలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ఆసియా జట్లు సిద్ధం కావడానికి ఆసియా కప్‌ను పొట్టి ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. మొత్తం ఎనిమిది జట్లు టోర్నీలో పాల్గొంటున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ Aలో భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ ఉన్నాయి. గ్రూప్ Bలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, హాంకాంగ్ ఉన్నాయి. ఆసియా కప్ నేపథ్యంలో ఈ టోర్నమెంట్‌లో (టీ20 ఫార్మాట్‌లో) నమోదైన టాప్ 5 రికార్డులను ఓసారి పరిశీలిద్దాం.

సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్:
ఇప్పటివరకు టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌లో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు సెంచరీలు చేశారు. 2022 సెప్టెంబర్‌లో దుబాయ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై విరాట్ కోహ్లీ 61 బంతుల్లో 122 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. విరాట్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. 2016 ఆసియా కప్ క్వాలిఫైయింగ్ గ్రూప్ మ్యాచ్‌లో హాంకాంగ్‌కు చెందిన బాబర్ హయత్ ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 60 బంతుల్లో 122 పరుగులు బాదాడు.

5 వికెట్లు తీసిన బౌలర్:
ఆసియా కప్‌లో 5 వికెట్లు తీసిన ఏకైక బౌలర్ భారత పేసర్ భువనేశ్వర్ కుమార్. సెప్టెంబర్ 2022లో దుబాయ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై 4 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. విరాట్ కోహ్లీ 122 పరుగులు చేసిన మ్యాచ్ కూడా ఇదే. 2022లో పాకిస్థాన్‌పై భువనేశ్వర్ 26 రన్స్ ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. షాదాబ్ ఖాన్, మహ్మద్ నబీ, లసిత్ మలింగ, ప్రమోద్ మధుషన్, ఆమిర్ కలీమ్ టీ20 ఆసియా కప్‌లో 4 వికెట్స్ (4-4) పడగొట్టారు.

200+ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్:
టీ20 ఆసియా కప్‌లో నలుగురు బ్యాట్స్‌మెన్ 200 కంటే ఎక్కువ పరుగులు చేశారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ అగ్ర స్థానంలో ఉన్నాడు. 9 ఇన్నింగ్స్‌లలో 429 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. మొహమ్మద్ రిజ్వాన్ 281 ​​పరుగులు (1 అర్ధ సెంచరీ)తో రెండవ స్థానంలో.. రోహిత్ శర్మ 271 పరుగులతో (2 అర్ధ సెంచరీ) మూడవ స్థానంలో.. బాబర్ హయత్ 235 పరుగులతో నాల్గవ స్థానంలో ఉన్నాడు.

Also Read: Rohit Sharma: అర్ధరాత్రి ఆసుపత్రికి రోహిత్ శర్మ.. వీడియో వైరల్! ఆందోళనలో ఫాన్స్

10+ వికెట్లు:
టీ20 ఆసియా కప్‌లో 6 మంది బౌలర్లు 10 కంటే ఎక్కువ వికెట్లు తీశారు. ఈ జాబితాలో భువనేశ్వర్ కుమార్ (6 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు) టాప్‌లో ఉన్నాడు. అమ్జాద్ జావేద్ 7 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టగా.. అల్-అమీన్ హుస్సేన్, మహ్మద్ నవేద్, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్ 11 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

100+ భాగస్వామ్యాలు:
ఆసియా కప్‌లో నాలుగు సార్లు 100+ పరుగుల భాగస్వామ్యాలు నమోదయ్యాయి. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ 2022లో దుబాయ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై మొదటి వికెట్‌కు 119 పరుగులు జోడించారు. అదే సంవత్సరం షార్జాలో ఫఖర్ జమాన్, మహ్మద్ రిజ్వాన్ హాంకాంగ్‌పై రెండవ వికెట్‌కు 116 పరుగులు చేశారు. 2016లో మిర్పూర్‌లో షోయబ్ మాలిక్, ఉమర్ అక్మల్ కలిసి యూఏఈపై నాల్గవ వికెట్‌కు 114 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 2016లో దినేష్ చండిమల్, తిలకరత్నే దిల్షాన్ జోడి పాకిస్తాన్‌పై మొదటి వికెట్‌కు 110 పరుగులు జోడించారు.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Asia Cup 2025
  • Asia Cup 2025 Records
  • Asia Cup 2025 Top 5 Records
  • bhuvneshwar kumar
  • rohit sharma

తాజావార్తలు

  • Peanut Chikki: వంటరాని వారు కూడా ‘సింపుల్’గా చేసే పర్ఫెక్ట్ పల్లిపట్టి.. ఇలా చేయండి!

  • CSK vs DC: సంజు శాంసన్ షాందార్‌ సెంచరీ.. ఢిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ లక్ష్యం!

  • BJP: విధేయతకు పట్టం.. ఆఫీస్ ప్యూన్‌కు టికెట్ ఇచ్చిన బీజేపీ..

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Windfall Tax Hike: చమురు కంపెనీలకు షాక్.. డీజిల్‌పై సుంకం పెంచిన కేంద్రం

ట్రెండింగ్‌

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions