Krishnamachari Srikkanth Big Selection Hint for Asia Cup 2025: ఆసియా కప్ 2025 కోసం బీసీసీఐ నేడు భారత జట్టును ప్రకటించనుంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మధ్యాహ్నం 1.30కు జట్టును ప్రకటించనున్నారు. భారత జట్టును ప్రకటించబోతున్న నేపథ్యంలో టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్థానం గురించి సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గిల్‌కు టీ20 జట్టులో చోటు కష్టమే అని అనే న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. గిల్ ఆసియా కప్‌లో ఆడాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. తాజాగా గిల్ స్థానంపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందించారు.
‘శుభ్‌మన్ గిల్ టీ20ల్లో భారత్ కెప్టెన్ అయి ఉంటే తప్పకుండా జట్టులో ఉండేవాడు. అప్పుడు యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, వైభవ్ సూర్యవంశీల ప్రస్తావన ఉండేది కాదు. గిల్ ఓపెనర్‌గా వచ్చేవాడు. నిజానికి గిల్ 2026 టీ20 ప్రపంచకప్ ప్లానింగ్‌లో లేడు. ఇప్పుడు ఉన్నపళంగా అతడి పేరెందుకు సోషల్ మీడియాలో వినిపిస్తోంది?. గిల్ కొంతకాలంగా అద్భుతంగా ఆడుతున్నాడు, అది నిజమే. అయినా కూడా టీ20 జట్టులో అతడికి స్థానం లభించకపోవచ్చు’ అని కృష్ణమాచారి శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్లో చెప్పారు. టీ20 ఫార్మాట్లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మలు టాపార్డర్‌లో సెట్ అయ్యారు. దాంతో గిల్, యశస్వి, సాయిలకు ఇప్పుడే స్థానం దక్కకపోవచ్చు.
Also Read: Asia Cup 2025: కౌంట్ డౌన్ స్టార్.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
2025 ఆసియా కప్ కోసం భారత జట్టు: (అంచనా)
బ్యాట్స్‌మెన్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్
ఆల్‌రౌండర్లు: అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివం దుబే
వికెట్ కీపర్: సంజు శాంసన్, జితేష్ శర్మ
స్పిన్నర్లు: కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
ఫాస్ట్ బౌలర్లు: జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ
రిజర్వ్‌లు: వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా