Site icon NTV Telugu

Asia Cup 2025: సిగ్గుచేటు.. సూర్యకుమార్ యాదవ్‌పై ఇండియన్ ఫాన్స్ ఫైర్!

Suryakumar Yadav

Suryakumar Yadav

ఆసియా కప్‌ 2025లో భారత్ తన ప్రయాణంను నేడు మొదలెట్టనుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య యూఏఈని టీమిండియా ఢీకొట్టనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్.. ఈసారీ హాట్ ఫేవరెట్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. టోర్నీలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నా.. భారత్ మాదిరి పటిష్టంగా లేవు. నేడు యూఏఈపై భారత్ భారీ విజయం సాదిస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే టోర్నీ ఆరంభానికి ముందే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ చిక్కుల్లో పడ్డాడు.

ఆసియా కప్‌ 2025 ఆరంభం సందర్భంగా మంగళవారం 8 జట్ల కెప్టెన్లతో ప్రెస్ కాన్ఫరెన్స్‌ జరిగింది. ప్రెస్ కాన్ఫరెన్స్‌ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన ఇండియన్ ఫాన్స్ సూర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆపరేషన్ సిందూర్ తర్వాత భారతదేశానికి వార్నింగ్ ఇచ్చిన పాకిస్తాన్ అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కరచాలనం చేశాడు. ఈ వ్యక్తులు తమ ముఖాలను అద్దంలో ఎలా చేసుకుంటారో అర్ధం కావడం లేదు. వాళ్లు మన అమాయక ప్రజలను చంపుతారు. ఇక్కడ మన కెప్టెన్ వారితో కరచాలనం చేశాడు. ఇది సిగ్గుచేటు’ అని ఓ నెటిజన్ మండిపడ్డాడు.

Also Read: Anil Sunkara: బాబుతో ఒక్క సినిమా చేస్తే చాలని వచ్చా.. అనిల్‌ సుంకర ఆసక్తికర వ్యాఖ్యలు!

‘పాకిస్తాన్ హోం మంత్రితో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫోటోలకు పోజులిచ్చి, కరచాలనం చేశాడు. ఇది బీసీసీఐ సిగ్గులేనితనానికి నిదర్శనం. మోసిన్ నఖ్వీ తన చేతులకు రక్తం పూసుకుని ఉన్నాడు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశం నాశనం కావాలని అతడు కోరుకున్నాడు’ అని మరో నెటిజెన్ ఫైర్ అయ్యాడు. ‘మన క్రికెటర్ల అసలు నైజం ఇదే. పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈమన జనాలను చంపారు. టీమిండియా కెప్టెన్ భారతదేశంపై అణు దాడి చేయాలని కోరుకున్న పీసీబీ అధ్యక్షుడిని కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చాడు’ అని కామెంట్స్ చేస్తున్నారు. సెప్టెంబర్ 14న జరగనున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు ఈ ఘటన మరింత ఉద్రిక్తతను పెంచింది.

Exit mobile version