Sahibzada Farhan: ఆసియా కప్ 2025 సూపర్ 4లో భాగంగా ఆదివారం నాడు భారత్ తో జరిగిన కీలక మ్యాచ్ లో పాకిస్తాన్ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటర్ ఫర్హాన్ తన హాఫ్ సెంచరీ తర్వాత చేసిన సెలబ్రేషన్స్ ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. భారత అభిమానులను రెచ్చగొట్టేలా, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచేలా అతని ప్రవర్తన ఉందని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
Haris Rauf: ఛీ.. ఛీ.. మొత్తానికి పాకిస్థానీ బుద్ధి బయటపెట్టావ్ కదరా.. వీడియో వైరల్
ఈ మ్యాచ్‌లో ఫర్హాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత, బ్యాట్‌ను గన్ మాదిరిగా పట్టుకుని ఫైరింగ్ చేస్తున్నట్లు ఊగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా నెటిజన్లు ఫర్హాన్‌ను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి సమయాల్లో గన్ ఫైరింగ్ సెలబ్రేషన్స్ అవసరమా అంటూ అతనిపై ఫైర్ అవుతున్నారు.
New GST: సామాన్యులకు బిగ్ రిలీఫ్.. అమల్లోకి జీఎస్టీ 2.o.. వీటి రేట్లు తగ్గాయి..
ఫర్హాన్ చేసిన ఈ సెలబ్రేషన్స్ వెనుక పహల్గాం ఉగ్రదాడిని ఉద్దేశించి ఉండవచ్చని చాలామంది భావిస్తున్నారు. అంతేకాదు, అతను భారత డగౌట్ వైపు చూస్తూ ఇలా సెలబ్రేట్ చేసుకోవడం మరింత వివాదానికి తెరలేపింది. ఈ చర్యను చూసిన క్రికెట్ అభిమానులు ఇది విద్వేషపూరితమైన చర్య అని, ఇలాంటి పనులు తగ్గించుకొని మ్యాచ్ ఎలా గెలవాలి అనే దానిపై దృషి పెడితే మంచిదని నెటిజన్లు సూచిస్తున్నారు.
Bumrah is a very potent bowler but not against Sahibzada FARHAN pic.twitter.com/rdaILNBR7C
— A. (@Ahmadridismo) September 21, 2025