Pakistan girl supports Virat Kohli in Asia Cup 2023 IND vs PAK Match: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి భారత్‌లోనే కాకుండా.. పాకిస్తాన్‌లోనూ చాలామందే అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. విరాట్ ఆటను చూసేందుకు వారు తరచూ మైదానానికి వస్తుంటారు. ఆసియా కప్ 2023లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్ చూసేందుకు ఓ పాకిస్థాన్ యువతి వచ్చింది. మైదానంలో కోహ్లీని చూసి తెగ సంబరపడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ 4 పరుగులకే ఔటవ్వడంతో నిరాశ చెందింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘నేను విరాట్ కోహ్లీకి పెద్ద అభిమానిని. కోహ్లీ కోసమే నేను భారత్, పాకిస్తాన్ మ్యాచ్ చూడ్డానికి వచ్చాను. విరాట్ సెంచరీ చేయకపోవడంతో చాలా నిరాశ చెందా. కోహ్లీ నా మనసు గాయపరిచాడు’ అని పాకిస్థాన్ యువతి మీడియాకు తెలిపింది. పాకిస్తాన్ జట్టుకు సపోర్ట్ చేస్తావా? లేదా కోహ్లీకా అని అడగ్గా.. పాకిస్తాన్ అని చెప్పింది. ఇక బాబర్ ఆజామ్, విరాట్ కోహ్లీలలో ఫేవరెట్ ఎవరనే ప్రశ్నకు కోహ్లీ అని ఆ యువతి తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Also Read: BAN vs AFG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. తప్పక గెలవాల్సిందే!
ఆసియా కప్ 2023లో ఎంతో ఆసక్తి రేకెత్తించిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. చిరకాల ప్రత్యర్థుల పోరుకు వరుణుడు అడ్డుపడ్డాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయింది. భారత ఇన్నింగ్స్‌లో రెండుసార్లు అంతరాయం కలిగించిన వరుణుడు.. ఇన్నింగ్స్ ముగిశాక మరోసారి వచ్చాడు. ఈసారి వర్షం భారీగా పడడంతో పాక్ ఇన్నింగ్స్‌లో ఒక్క కూడా పడలేదు. దాంతో ఇండో-పాక్ మ్యాచ్ ఎంజాయ్ చేద్దామనుకున్న అభిమానులకు నిరాశ తప్పలేదు.
A Pakistan fan came for Virat Kohli said:
"I came only for Virat Kohli, I expected a century from him. My heart is broken". pic.twitter.com/PTbfhuOT9d
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 3, 2023