Asia Cup 2023 Awards List: ఆసియా కప్ విన్నర్ భారత్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?.. అవార్డు విజేతల పూర్తి జాబితా ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asia Cup Complete List of Award Winners Prize Money: శ్రీలంక వేదికగా జరిగిన ఆసియా కప్ 2023ను భారత్ సొంతం చేసుకుంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించి.. ఎనిమిదోసారి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ (6/21) చెలరేగడంతో శ్రీలంక 50 పరుగులకే ఆలౌట్ అయింది.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (27 నాటౌట్; 19 బంతుల్లో 6 ఫోర్లు), ఇషాన్ కిషన్ (23 నాటౌట్; 18 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు.
ఆసియా కప్ విన్నర్ ప్రైజ్ మనీ:
ఆసియా కప్ 2023 టోర్నీలో విజేతగా నిలిచిన టీమిండియాకు భారీ మొత్తంలో ప్రైజ్ మనీ లభించింది. టీమిండియా 150,000 యూఎస్ డాలర్లను (భారత కరెన్సీలో సుమారు రూ. 1 కోటీ 25 లక్షలు) ప్రైజ్ మనీగా అందుకుంది. రన్నరప్‌గా నిలిచిన శ్రీలంకకు 75,000 యూఎస్ డాలర్లు (భారత కరెన్సీలో రూ. 62 లక్షలు) ప్రైజ్ మనీగా దక్కింది.
Also Read
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ప్రైజ్ మనీ:
పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు, శ్రీలంకపై 4 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్.. ఆసియా కప్ 2023 టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్స్ తీసిన బౌలర్‌గా నిలిచాడు. కుల్దీప్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు లభించింది. 15,000 యూఎస్ డాలర్లను (రూ. 12 లక్షలు) మణికట్టు స్పిన్నర్ ప్రైస్ మనీగా అందుకున్నాడు.
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ప్రైజ్ మనీ:
ఫైనల్ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బ తీసిన మహ్మద్ సిరాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. దాంతో సిరాజ్ 5,000 (రూ. 4.16 లక్షలు) యూఎస్ డాలర్లను ప్రైజ్ మనీ అందుకున్నాడు. ఈ మొత్తంను అతను గ్రౌండ్స్‌మన్‌కు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. సిరాజ్ ఫైనల్లో ఆరు వికెట్స్ (6/21) పడగొట్టిన విషయం తెలిసిందే.
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
‘క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్’ ప్రైజ్ మనీ:
శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ 2023 ఫైనల్లో భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు ‘క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. దాంతో జడేజా 3,000 యూఎస్ డాలర్ల ప్రైజ్ మనీ అందుకున్నాడు.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!