Asia Cup 2022 third match between Afghanistan vs Bangladesh
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్ రానేవచ్చింది. నేడు దుబాయ్‌లోని షార్జా వేదిక మూడో మ్యాచ్ జరుగనుంది. ఆఫ్ఘనిస్తాన్-బంగ్లాదేశ్ జట్ల జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7.30 ప్రారంభం కానుంది. అయితే.. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ ఆసియా కప్ టీ20 తొలి మ్యాచ్ శ్రీలంకకు ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగగా.. టాస్ గెలిచిన ఆఫ్ఘాన్ బౌలింగ్ తీసుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఆటగాళ్లు.. 19.4 ఓవర్లకు 105 పరుగుల తీసి ఆలౌట్ అయ్యారు. అయితే అనంతరం 106 పరుగుల లక్ష్య చేధనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 10.1 ఓవర్లకే లక్ష్యాన్ని సాధించింది.
దీంతో 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఆఫ్ఘన్ ఘన విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. రెండో మ్యాచ్ దయాద జట్లైన ఇండియా-పాక్‌ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా బౌలింగ్ తీసుకోగా.. బ్యాటింగ్ దిగిన పాక్ ఆటగాళ్లు 19.5 ఓవర్ల ఆలౌట్ అయ్యి 147 పరుగులు సాధించారు. అయితే తరువాత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా జట్టు 19.4 ఓవర్లో 148 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది. అయితే.. నేడు మరోసారి బరిలోకి దిగనున్న ఆఫ్ఘాన్ జట్టు బంగ్లాదేశ్‌పై విజయం సాధింస్తుందో చూడాలి. అయితే.. ఇండియా-హాంగ్‌కాంగ్ మధ్య పోరు జరుగనుంది.