Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ashwini Vaishnaw Announces Amaravati Hyderabad Bullet Train South Coast Railway Zone

Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..

Published Date :April 28, 2026 , 12:25 pm
By Sudhakar Ravula
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ashwini Vaishnaw: అభివృద్ధి, సంక్షేమం విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తోందని కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. విశాఖలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు కీలక ప్రకటనలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో కీలకమైన సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌ను 2026 జూన్ 1న అధికారికంగా నోటిఫై చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఈ జోన్ ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు.

విశాఖ ఇక ఏఐ పట్నం
గూగుల్ ఏఐ డేటా సెంటర్‌తో విశాఖపట్నం ఇకపై ఏఐ పట్నంగా మారుతుందని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌కు సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. గూగుల్‌తో ఎంఓయూ కుదుర్చుకున్న తక్కువ సమయంలోనే శంకుస్థాపన జరగడం విశేషమన్నారు. త్వరలోనే ఈ ఏఐ డేటా సెంటర్‌ను ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించే రోజు దగ్గరలోనే ఉందని చెప్పారు. విద్య, వైద్యం, ఏరోస్పేస్, లాజిస్టిక్స్, వ్యవసాయం వంటి రంగాల్లో ఏఐ విప్లవం రానుందని తెలిపారు.

Also Read

  • Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
  • Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన
  • వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
  • Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు

భారత్ టెక్నాలజీ రంగంలో ముందంజ
భారత్ ఐటీ సేవల రంగంలో ప్రపంచ నాయకత్వం వహిస్తోందని అన్నారు వైష్ణవ్.. మొబైల్ తయారీ రంగంలో భారత్ భారీ ముందడుగు వేసిందని, దేశం నుంచి అత్యధికంగా ఎగుమతి అవుతున్న ఉత్పత్తిగా మొబైల్ ఫోన్లు మారాయని చెప్పారు. ప్రస్తుతం దేశీయ అవసరాల్లో 50 శాతం ఎలక్ట్రానిక్ పరికరాలు భారత్‌లోనే తయారవుతున్నాయని వెల్లడించారు. సెమీ కండక్టర్ మిషన్‌లో భాగంగా వాణిజ్య ఉత్పత్తి కూడా ప్రారంభించామని, భారత్ ఇప్పుడు సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీలో విశ్వసనీయ భాగస్వామిగా ఎదిగిందన్నారు.

గూగుల్‌కు ప్రత్యేక పిలుపు
డేటా సెంటర్లకు అవసరమైన సర్వర్లు, జీపీయూలు, చిప్‌లను కూడా భారత్‌లోనే తయారు చేయాలని గూగుల్‌ను కోరారు. ఈ సందేశాన్ని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు కూడా తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక, విశాఖ నుంచి మూడు సబ్‌సీ కేబుల్స్ వేస్తున్నందుకు గూగుల్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్ మీదుగా యూరప్‌కు, ఆఫ్రికా మీదుగా అమెరికాకు కనెక్టివిటీ కల్పించేలా ఈ కేబుల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

ఏపీకి భారీ రైల్వే బడ్జెట్
ఏపీకి రూ.10,134 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయించామని మంత్రి వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గతంలో కేవలం రూ.886 కోట్లు మాత్రమే ఉండేదని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.1.06 లక్షల కోట్ల రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. 74 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని, 832 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించామని, 1039 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లు వేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 100 శాతం రైల్వే ఎలక్ట్రిఫికేషన్ పూర్తి అయిందన్నారు.

వందే భారత్, అమృత్ భారత్ సేవలు
ప్రస్తుతం ఏపీలో 16 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని, 22 అమృత్ భారత్ సేవలు కూడా రాష్ట్రం నుంచి అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇక అమరావతి నుంచి హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు త్వరలోనే సాకారం కానుందని అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా కేవలం 70 నిమిషాల్లో హైదరాబాద్ చేరుకోవచ్చన్నారు. అలాగే అమరావతి నుంచి చెన్నైకు 112 నిమిషాల్లో చేరుకునేలా మరో బుల్లెట్ ట్రైన్ ప్రణాళిక కూడా ఉందన్నారు. ప్రతిపక్ష పార్టీలు ప్రతి అంశాన్నీ రాజకీయంగా చూస్తున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం అభివృద్ధి, సంక్షేమంలో సమాన న్యాయం చేస్తోందని స్పష్టం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amaravati Chennai bullet train
  • Amaravati Hyderabad bullet train
  • Andhra Pradesh railway projects
  • AP bullet train project
  • Ashwini Vaishnaw bullet train

తాజావార్తలు

  • Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..

  • Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్

  • Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..

  • Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..

  • Shreyas Iyer: “నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను”.. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions