Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- తమిళనాడులో దారుణం..
- బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- చెంగల్పట్టు జిల్లా తాంబరంలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: కేవలం ఒకే ఒక ప్రశ్న.. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అది కూడా బస్సు ఏ రూటుకు వెళ్తుందన్న చిన్న సందేహం అడిగినందుకు ఓ వృద్ధుడిని చంపేశాడో యువకుడు. తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లా తాంబరంలో జరిగిన ఈ దారుణం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ఒకసారి చెప్పినా మళ్లీ అడిగారన్న కోపంతో, వృద్ధుడని కూడా చూడకుండా గొంతు నులిమి చంపేశాడు అమర్‌నాథ్ అనే నిందితుడు. తాంబరం ప్రాంతానికి చెందిన చంద్రశేఖరన్ (72) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నారు. ఉదయం వడపళనికి వెళ్లేందుకు తాంబరం శానిటోరియం వద్ద 70-జి నంబరు బస్సు ఎక్కారు. అదే సమయంలో అమర్‌నాథ్ అనే యువకుడు కూడా బస్సు ఎక్కి చంద్రశేఖరన్ పక్క సీటులో కూర్చున్నాడు. బస్సు ఎక్కడికి వెళ్తుందని చంద్రశేఖరన్ పక్కనే ఉన్న అమర్‌నాథ్‌ను అడిగారు. ఆ బస్సు వడపళనికి వెళ్తుందని అమర్‌నాథ్ సమాధానం ఇచ్చాడు.
Read Also: Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
Also Read
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
అయితే, వృద్ధాప్యం వల్ల చంద్రశేఖర్ మళ్లీ అదే ప్రశ్న అడిగారు. దీంతో అమర్‌నాథ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కోపంతో ఊగిపోయిన అమర్‌నాథ్ వృద్ధుడిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తోటి ప్రయాణికులు వారించినా వినకుండా, చంద్రశేఖరన్ గొంతు నులిమేశాడు. దీంతో ఆయన బస్సులోనే కుప్పకూలిపోయారు. బాధితుడిని వెంటనే క్రోంపేట ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఘటన తర్వాత బస్సు నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడు అమర్‌నాథ్‌ను ప్రయాణికులు వెంబడించి పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేవలం రూట్ అడిగినందుకే ఇంతటి దారుణానికి ఒడిగట్టడం స్థానికంగా కలకలం రేపింది.
తాజావార్తలు
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!