Ashish Vidyarthi : నటుడు ఆశిష్ విద్యార్థి కొన్ని రోజుల క్రితం 57 ఏళ్ల వయసులో రెండో సారి పెళ్లి చేసుకున్నాడు. అతను మొదట నటి రాజోషి బారువా (పిలు విద్యార్థి)ని వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన 22 ఏళ్ల తర్వాత వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆశిష్ రెండో పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో చాలా మంది అతడిని ట్రోల్ చేశారు. ఇప్పుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మొదటి భార్యతో విడాకులు తీసుకోవడానికి గల కారణాన్ని చెప్పాడు. విడాకుల అడుగు వేసే ముందు ఇద్దరూ ప్రత్యేక నిపుణుల సాయం తీసుకున్నారని కూడా వివరించాడు. 2022లో రాజోషితో విడాకులు తీసుకున్న తర్వాత, ఆశిష్ రూపాలి బారువాను వివాహం చేసుకున్నాడు.
చదవండి:Pope Francis: బాలాసోర్ ట్రైన్ ప్రమాదంపై పోప్ ప్రాన్సిస్ సంతాపం..
జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, “మేము చాలా ఆలోచించాం. మా మధ్య విభేదాలు లేదా కొన్ని విషయాలను తగ్గించుకోలేమని గ్రహించాము. ఇంకా ఆగితే గొడవలు వస్తాయని, ఒకరిపై ఒకరు కోపగించుకుంటారని తెలుసు. మేము ఒకరితో ఒకరు చాలాసార్లు కమ్యూనికేట్ చేసుకున్నాము. అంతకు ముందు ప్రొఫెషనల్స్ (కౌన్సెలింగ్) సహాయం కూడా తీసుకున్నాం. మేము మా వంతు ప్రయత్నం చేసాము, కానీ ఏదీ పని చేయలేదు. మేమిద్దరం చర్చించుకుని అర్థ (కొడుకు) గురించి మాట్లాడుకున్నాం. నాకు ఇప్పుడు విషయాలు భిన్నంగా కనిపిస్తున్నప్పటికీ, మా సంబంధాన్ని కొనసాగించేందుకు చాలా ప్రయత్నించాం. అందుకే నా మనసుకు బాధ కలిగింది.”
చదవండి:RBI: మీ దగ్గర పాతనోట్లు ఉంటే వెంటనే బ్యాంకులో మార్చుకోండి.. షరతులు వర్తిస్తాయి
రాజోషికి ఆశిష్ రెండో పెళ్లి ఆలోచన ముందే చెప్పాడు. “నేను ఒంటరిగా ఉండకూడదని చాలా స్పష్టంగా చెప్పాను. నాకు ఒకరి సాంగత్యం కావాలి. ఒక వ్యక్తి వేరొకరితో ఉండటంలో భద్రత ఉంటుంది అనుకుంటే ఇతరులు ఎందుకు జోక్యం చేసుకోవాలి? అందుకే పిలు(ఆశిష్ మొదటి భార్య)కి రెండో పెళ్లి ఆలోచన చేశాను’. జీవితం మొదటి భాగం ముగిసిన తర్వాత, మేము మా రెండవ మార్గంలో వేర్వేరు దిశలలో నడుస్తున్నామని ఆశిష్ తెలిపారు. మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆశిష్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. “పిలు నా కొడుకుకి తల్లి మాత్రమే. పిలు నా స్నేహితురాలు, ఆమె నా భార్య. దయచేసి ఇదంతా ఏ దుఃఖం లేకుండా జరిగిందని అనుకోవద్దు. ఒక వ్యక్తి నుండి విడిపోవడం ఎల్లప్పుడూ బాధాకరమైనది. మొత్తం ప్రక్రియ చాలా కష్టం,” అని అతను చెప్పాడు.