కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్ ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్‌గా మారిపోయింది. గతంలో ఈమె చేసిన సినిమాలు పెద్దగా గుర్తింపు తీసుకురాకపోయినా, ఈ ఏడాది సంక్రాంతి మాత్రం అమ్మడి జాతకాన్ని మార్చేసింది. మాస్ రాజా రవితేజ సరసన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాలో నటించి సాలిడ్ హిట్ అందుకుంది. ఈ సినిమా సక్సెస్‌తో ఆషికకు టాలీవుడ్‌లో ‘గోల్డెన్ లెగ్’ అనే ట్యాగ్ కూడా వచ్చేసింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ విజువల్ వండర్ ‘విశ్వంభర’లో కూడా ఆషిక ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో ఈ బ్యూటీ బిజీ అయిపోయింది. ఇందులో భాగంగా తాజా సమాచారం ప్రకారం..
Also Read : Ellamma : ఎల్లమ్మలో హీరోయిన్ ఎవరంటే ?
చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన తదుపరి చిత్రాన్ని సీనియర్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ కోసం చాలా మంది పేర్లను పరిశీలించిన మేకర్స్, చివరికి ఆషిక రంగనాథ్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. శ్రీను వైట్ల మార్క్ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్న ఈ మూవీలో శర్వానంద్-ఆషిక జంట చూడటానికి చాలా ఫ్రెష్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి బరిలో నిలపాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అంటే 2026 సంక్రాంతిని తన ఖాతాలో వేసుకున్న ఆషిక, 2027 సంక్రాంతికి కూడా బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. వరుస పెట్టి పెద్ద సినిమాలు ఓకే చేస్తూ ఈ భామ టాలీవుడ్‌లోనే సెటిల్ అయ్యేలా ఉంది.