Neha Shetty : తెలుగు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ పేరు తెచ్చుకున్న హీరోయిన్ ” నేహా శెట్టి “. మెహబూబా అనే చిన్న సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ డీజే టిల్లు తెలుగు సినిమాతో ఒక్కసారిగా పాపులర్ హీరోయిన్ అయిపోయింది. డీజే టిల్లులో రాధికా పాత్రలో నేహా శెట్టి కెరియర్ బెస్ట్ హిట్టును అందుకుంది. ఈ దెబ్బతో ఆవిడ తలరాత మారిపోయింది. వరుసగా భారీ ఆఫర్లను అందుకుంది. ఇక ఆడియన్స్ ను ఆకట్టుకునే మంచి ఫిజిక్ ఉన్న అందం ఈమె సొంతం. తాజాగా డీజే టిల్లు స్క్వేర్ లో కూడా మరోసారి ఈమె గెస్ట్ ఆపీరియన్స్ ఇచ్చి ఆకట్టుకుంది. ఇక మరోవైపు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విజయంతో సంబంధం లేకుండా తన నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.
Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో ఓపెన్ లూప్ టికెటింగ్..!
ఇక ప్రస్తుతం నేహా శెట్టి తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఫాన్స్ తో చాట్ చేస్తున్నా సమయంలో తన ఫేవరెట్ మూవీ నుంచి తెలిపింది. ఓ అభిమాని ఆమెను మీ ఫేవరెట్ సినిమా ఏది అని అడగగా.. దానికి తన ఫేవరెట్ సినిమా ప్రస్తుతానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్న ” కల్కి ” సినిమా అంటూ తెలిపింది. దీనికి సంబంధించిన ఓ ఫోటోను తన స్టోరీ లైన్లో ఉంచగా.. దానిని స్క్రీన్ షాట్ తీసి ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇక కేవలం సినిమా గురించి మాత్రమే కాకుండా ఇతర విషయాల గురించి సంబంధించిన వాటిని కూడా నేహా శెట్టి ఇంస్టాగ్రామ్ ద్వారా తెలిపింది. తనకు హైదరాబాద్ నగరం ఫేవరెట్ సిటీ అంటూ తెలిపింది. అలాగే తనకి ఇష్టమైన రంగు బ్లూ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ అమ్మడు అప్పుడప్పుడు ఫోటో షూట్లతో కుర్రకారకు మతిపోయేలా చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ అమ్మడు చీర కట్టులో చేసిన ఫోటోషూట్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు సినిమాలతో బిజీగా గడిపేస్తుంది ఈ సొగసరి.
T20 WorldCup 2024: టీమిండియా విజయంపై అక్కసు వెళ్లగక్కిన ఆసీస్ మీడియా..