US: అమెరికా చదువు కోసం తండ్రినే చంపేశాడు.. బండారం బయటపడడంతో చివరికిలా..!
- అమెరికా చదువు కోసం పత్రాల్లో తండ్రినే చంపేశాడు
- అత్యుత్సాహనికి పోయి సోషల్ మీడియాలో పోస్టు
- కాలేజీ నుంచి బహిష్కరణ.. ఇండియాకు నిష్క్రమణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా వెళ్లేందుకు.. అక్కడ చదువు కునేందు అడ్డదారులు తొక్కాడు ఓ భారతీయ విద్యార్థి. అందుకోసం ఏకంగా కన్న తండ్రినే పత్రాల్లో చంపేశాడు. తొలుత పదో తరగతి బోర్డు పరీక్షల ఫలితాలను తారుమారు చేసి.. ఇప్పుడు ఏకంగా స్కాలర్‌షిప్‌తో యూఎస్ కాలేజీ అడ్మిషన్ పొందేందుకు అక్రమార్గాలను ఎంచుకుని కటకటాలపాలయ్యాడు. బండారం బయటపడడంతో కాలేజీ నుంచి బహిష్కరణకు గురవడమే కాకుండా నేరం రుజువైతే ఇరవై ఏళ్లు జైలు జీవితం అనుభవించాల్సిన దుస్థితిని తెచ్చుకున్నాడు.

Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
- Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
భారత్‌కు చెందిన ఆర్యన్ ఆనంద్.. 2023 ఆగస్టులో పెన్సిల్వేనియాలోని యూనివర్సిటీ ఆఫ్ లేహైలో అడ్మిషన్ పొందాడు. ఈ క్రమంలో తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించాడు. పదో తరగతి పరీక్ష ఫలితాలనూ ఫోర్జరీ చేసిన అతడు.. పూర్తి స్కాలర్‌షిప్ కోసం అక్రమ మార్గాలను ఎంచుకున్నాడు. తండ్రి బతికే ఉన్నప్పటికీ.. ఆయన చనిపోయినట్లు తప్పుడు డెత్ సరిఫిక్టెట్ సృష్టించాడు. ఇలా సంవత్సరం గడిచిపోయింది. చివరికి అతడి అత్యుత్సాహంతో నిజస్వరూపం బయటపడేలా చేసింది. గొప్పలకు పోయి.. ప్రగల్భాలు పలుకుతూ అసత్యాలతో తన జీవితాన్ని నిర్మించుకున్నానంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. పదో తరగతి బోర్డు ఫలితాలను తారుమారు చేసిన తీరు, తప్పుడు ధ్రువపత్రాలతో అమెరికా కాలేజీలో చేరిన తీరును సవివరంగా వివరించాడు. అనంతరం చదువుపై ఆసక్తి కోల్పోవడం, స్కాలర్‌షిప్ కోసం పరీక్షల్లో మోసాలకు పాల్పడటం, తప్పుడు ఇంటర్న్‌షిప్‌ల గురించి పూసగుచ్చినట్లుగా వివరించాడు. ఈ తీరే కొంపముంచింది.
ఈ విషయం కాస్త అధికారుల దృష్టికి వెళ్లింది. కాలేజీ యాజమాన్యం పోలీసులు దృష్టికి తీసుకెళ్లడంతో జూన్ 12న ఆనంద్‌ను అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసు గనుక రుజువైతే దాదాపు 20 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉంది. ఇక యూనివర్సిటీ నుంచి ఇప్పటికే బహిష్కరణకు గురయ్యాడు. ఇక దుకాణం సర్దుకుని త్వరలోనే ఇండియాకు రానున్నాడు.
తాజావార్తలు
-
Jadal Look: “మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా”.. ‘ది ప్యారడైజ్’ లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
-
Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
-
Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
-
Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
-
Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!