Kejriwal: ఈడీ అరెస్ట్‌పై సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం తీర్పుపై ఆప్ నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరీ ధర్మాసనం ఏం తీర్పు వెలువరిస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇదిలా ఉంటే మంగళవారం బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. కేజ్రీవాల్ అరెస్టుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయని న్యాయస్థానం తెలిపింది. హవాలా ద్వారా డబ్బు తరలింపుపై ఈడీ ఆధారాలు చూపించిందని, గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్లు అప్రూవర్ చెప్పారని ధర్మాసనం పేర్కొంది. కేజ్రీవాల్ అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధం కాదని వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రికి ఒక న్యాయం, సామాన్యులకు మరొక న్యాయం ఉండదని.. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేమీ ఉండవని స్పష్టం చేసింది. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనవసరం లేదని. నిందితుడి వీలును బట్టి విచారణ జరపడం సాధ్యం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం తీర్పు వెలువరించారు.
Also Read
- Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
ఇది కూడా చదవండి: Baba Ramdev: సుప్రీంకోర్టుకు బాబా రామ్‌దేవ్ బేషరతుగా క్షమాపణలు
మార్చి 21న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. తిరిగి ఏప్రిల్ 1న కోర్టులో హాజరుపరచగా ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. అనంతరం ఆయన ఈడీ కస్టడీని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేయగా.. మంగళవారం కొట్టేసింది. తాజాగా బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయస్థానం ఏం తీర్పు ఇస్తుందో చూడాలి. బెయిల్‌పై ఆప్ నేతలు గంపెడాశలు పెట్టుకుంది. ఓ వైపు పోలింగ్ సమయం ముంచుకొస్తోంది. ఇంకోవైపు నేతలంతా కేజ్రీవాల్ బెయిల్ కోసమే సమయం వెచ్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌కు రావాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: Israel: సిరియాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. వీడియో విడుదల
తాజావార్తలు
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!