సిరియాలో హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ విడుదల చేసింది. గాజాలో హమాస్‌పై యుద్ధానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా దాడులు చేస్తోంది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైతం ఆ మిలిటెంట్ సంస్థపై విరుచుకుపడుతోంది. తాజాగా బుధవారం ఉదయం మరోసారి వైమానిక దాడులు చేపట్టింది. హిజ్బుల్లా స్థావరాలను టార్గెట్ చేసుకుని ఈ వైమానిక దాడులు చేసింది. ఓ భవనంపై దాడికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: Ex MLA Pamula Rajeswari: జనసేనకు మరో షాక్.. వైసీపీ గూటికి పాముల రాజేశ్వరి..!
సిరియా కేంద్రంగా పనిచేస్తున్న లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా స్థావరాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ బుధవారం ప్రకటించింది. ఈ వైమానిక దాడుల్లో కీలక స్థావరాలు, సైనిక మౌలికవసతులను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎక్స్ వేదికగా విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: Ireland New PM: ఐర్లాండ్ నూతన ప్రధానిగా సైమన్ హారిస్
సిరియా భూభాగంపై జరుగుతున్న అన్ని కార్యకలాపాలకు ఆ దేశమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఐడీఎఫ్ తెలిపింది. హిజ్బుల్లా బలోపేతం కోసం మద్దతు ఇచ్చే ప్రయత్నాలను ఏమాత్రం సహించబోమని తేల్చి చెప్పింది. పరోక్షంగా సిరియా గడ్డ నుంచి హిజ్బుల్లా కార్యకలాపాలకు అనుమతినివ్వొద్దని హెచ్చరించింది. గాజాలో హమాస్‌పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా పలుసార్లు విరుచుకుపడింది. దీంతో ఐడీఎఫ్ ఆ మిలిటెంట్ గ్రూప్‌పైనా దాడులు చేస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ సోమవారం జరిపిన దాడిలో హిజ్బుల్లాలోని ప్రధాన విభాగమైన రాడ్వాన్ ఫోర్సెస్ కమాండర్ అలీ అహ్మద్ హుస్సేన్ మృతిచెందాడు.
ఇది కూడా చదవండి: karnataka High Court: 498ఏ దుర్వినియోగం అవుతోంది.. వరకట్న వేధింపుల కేసులో హైకోర్టు కీలక తీర్పు
హిజ్బుల్లాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. హమాస్‌కు మద్దతు తెలిపేవారిని విడిచిపెట్టే ప్రసక్తేలేదని పేర్కొంది. బుధవారం తెల్లవారుజామున హిజ్బుల్లా స్థావరాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఏప్రిల్ 1న సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌లోని ఏడుగురు సభ్యులతో సహా 16 మంది మరణించారని అబ్జర్వేటరీ తెలిపింది. ఈ దాడిపై ఇజ్రాయెల్ స్పందించలేదు. ఇక ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని అమెరికాకు కూడా ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది.
צה"ל תקף לפני זמן קצר תשתית צבאית שהוצבה בחזית שטח סוריה, אשר ממידע מודיעיני עולה כי שימשה את ארגון הטרור חיזבאללה.
צה"ל רואה במשטר הסורי אחראי לכל אשר קורה בשטחו ולא יאפשר ניסיונות אשר יובילו להתבססות ארגון הטרור חיזבאללה בחזיתו>> pic.twitter.com/Eh2W5LRyYH
— צבא ההגנה לישראל (@idfonline) April 9, 2024