NTV Telugu Site icon

Anant Ambani Wedding: ఆహ్వానం లేకుండా అనంత్ అంబానీ పెళ్లికి వచ్చిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్..

Arrest

Arrest

గత కొన్ని రోజులుగా అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పెళ్లిని చూసేందుకు అందరూ తహతహలాడారు. అలాంటి పరిస్థితిలో.. ఇద్దరు వ్యక్తులు ఆహ్వానం లేకుండా పెళ్లికి చేరుకున్నారు. వారిద్దరూ భారీ భద్రతను ఉల్లంఘించి వివాహ వేదిక జియో వరల్డ్ సెంటర్‌లోకి ప్రవేశించారు. విషయం తెలియగానే పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

READ MORE: Hyderabad Rains: హైదరాబాద్లో కుండపోత వర్షం.. గంట నుంచి ఎడతెరిపి లేని వాన

అనుమతి లేకుండా ప్రవేశించిన వారిలో ఒకరు యూట్యూబర్ వెంకటేష్ నర్సయ్య అల్లూరి కాగా, మరొకరు వ్యాపారవేత్తగా చెప్పుకుంటున్న లుక్మాన్ మహమ్మద్ షఫీ షేక్ ఉన్నారు. ముంబైకి చెందిన బీకేసీ పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిపై ప్రత్యేక కేసులు నమోదు చేశారు. ఓ వ్యక్తి పెళ్లికి హాజరయ్యేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. రెండు కేసుల్లో చట్టపరమైన చర్యలు తీసుకున్న పోలీసులు నిందితులకు నోటీసులు జారీ చేశారు. అనంతరం వారిని విడుదల చేశారు.

READ MORE:Delhi: ఢిల్లీలోని జీటీబీ ఆసుపత్రిలో పట్టపగలు కాల్పులు.. రోగి అక్కడికక్కడే మృతి

పెళ్లిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీతో అంబానీ కుటుంబ సభ్యులందరూ పెళ్లికి హాజరయ్యారు. ఈవెంట్ సమయంలో ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఆపరేషన్ సిస్టమ్ (ISOS) సెటప్ చేశారు. ఈవెంట్ భద్రతా ఆపరేషన్ ఈ ISOS కేంద్రం నుంచి పర్యవేక్షించబడుతుంది. 60 మంది భద్రతా బృందంలో 10 మంది ఎన్‌ఎస్‌జి కమాండోలు, పోలీసు అధికారులు ఉన్నారు. 200 మంది అంతర్జాతీయ భద్రతా సిబ్బందిని నియమించనున్నారు. 300 మంది సెక్యూరిటీ సభ్యులు ఉన్నారు. బీకేసీలో 100 మందికి పైగా ట్రాఫిక్ పోలీసులు, ముంబై పోలీసు సిబ్బందిని మోహరించారు.