Amaravati Drone Summit 2024: డ్రోన్ సమ్మిట్‌కు చకచకా ఏర్పాట్లు
- అమరావతి డ్రోన్ సమ్మిట్-2024కు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు
- పున్నమీ ఘాట్ వద్ద డ్రోన్ షో
- ఏర్పాట్లు పరిశీలించిన డ్రోన్ కార్పొరేషన్ ఎండీ దినేష్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Drone Summit 2024: ఈ నెల 22-23 వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న అమరావతి డ్రోన్ సమ్మిట్-2024కు ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. రెండు రోజుల సదస్సు సరిగే మంగళగిరి సీకే కన్వెన్షన్‌లోనూ, ఇటు 22వ తేదీ సాయంత్రం విజయవాడ కృష్ణానది తీరాన ఉన్న పున్నమీ ఘాట్ వద్ద మెగా డ్రోన్ షో నిర్వహణకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. పున్నమీ ఘాట్ వద్ద నిర్వహించే డ్రోన్ షోకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా అధికారులతో కలిసి డ్రోన్ కార్పొరేషన్ ఎండీ కె. దినేష్ కుమార్ పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లా ఇంఛార్జి కలెక్టర్ నిధి మీనా, విజయవాడ నగర పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబు, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తదితర ఉన్నతాధికారులతో కలిసి పున్నమీఘాట్‌లో చేపడుతున్న ఏర్పాట్ల గురించి చర్చించారు.
Read Also: Attack on Inter Student: భార్య వద్దు నీవే కావాలంటూ వేధించాడు.. వాంగ్మూలం ఇచ్చిన బాధితురాలు
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనతోపాటు మంత్రులు, వీవీఐపీలు, ఈ డ్రోన్ షో తిలకించడానికి వస్తుండటంతో భద్రత ఏర్పాట్లు ఎలా చేయాలి, ఎవరెవరికి ఏఏ ప్రాంతాల్లో ఈ షో తిలకించేలా ఏర్పాట్లు చేయాలి అనే దానిపైన అధికారులు నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ షో తిలకించడానికి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశమున్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా, పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని డ్రోన్ కార్పొరేషన్ ఎండీ దినేష్ కుమార్ పోలీసు అధికారులను కోరారు. డ్రోన్ షోతో పాటు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రాకర్ షో కూడా ఉంటుంది కాబట్టి ఆయా కార్యక్రమాలు తిలికించడానికి ఇబ్బందులు లేకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు. షో తిలకించడానికి వచ్చే ప్రజలకు మంచినీరు, తదితర సదుపాయాలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. వాహనాల పార్కింగు ఎక్కడ చేయాలి, ఏఏ వాహనాలను లోనికి అనుమతించాలి తదితర అంశాల గురించి అధికారులు చర్చించారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!