ఈ నెల 22-23 వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న అమరావతి డ్రోన్ సమ్మిట్-2024కు ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. రెండు రోజుల సదస్సు సరిగే మంగళగిరి సీకే కన్వెన్షన్‌లోనూ, ఇటు 22వ తేదీ సాయంత్రం విజయవాడ కృష్ణానది తీరాన ఉన్న పున్నమీ ఘాట్ వద్ద మెగా డ్రోన్ షో నిర్వహణకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.