AP Cabinet Emergency Meeting: అర్నబ్ తుఫాన్ నష్టంపై సమీక్ష.. రేపు కేబినెట్ అత్యవసర భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Emergency Meeting: అర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ నష్టాన్ని మిగిలిచ్చింది.. అయితే, అర్నబ్ తుఫాన్ ప్రభావం, తాజా పరిస్థితులపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం రేపు అత్యవసరంగా సమావేశం కానుంది. తుఫాన్ పరిస్థితులు, ప్రభావిత జిల్లాల్లో జరిగిన నష్టం, ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులపై ఏపీ కేబినెట్ ప్రధానంగా చర్చించనుంది. బాధితులకు అందిస్తున్న సహాయక చర్యలు, పునరుద్ధరణ పనుల పురోగతిపై కూడా సమీక్షించే అవకాశం ఉంది. మరోవైపు, అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రాంతాలను సందర్శించి, అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించనున్నారు. బాధితులను పరామర్శించి, సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులపై అధికారులతో సమీక్షించే అవకాశం ఉంది.
కాగా, అర్నబ్ తుఫాన్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందిస్తామని ఇప్పటికే ప్రకటించారు సీఎం చంద్రబాబు.. ఇళ్లు దెబ్బతిన్న బాధితులకు రూ.10 వేల ఆర్థిక సాయం, కిరాణా దుకాణాలు, రెస్టారెంట్లు దెబ్బతిన్న వారికి రూ.25 వేల చొప్పున సాయం అందిస్తామని వెల్లడించారు. తుపాను ప్రభావిత కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని చెప్పారు. ఇక, తుఫాన్ వల్ల జరిగిన నష్టంపై రేపు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని చంద్రబాబు తెలిపారు. నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్రం నుంచి ప్రత్యేక బృందాన్ని పంపించాలని కోరనున్నట్లు వెల్లడించారు. పంటలు, పశువులు, మత్స్య సంపద, ఇతర రంగాల్లో నష్టపోయిన వారందరికీ పారదర్శకంగా పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు. ఇక, తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ పంటలకు పరిహారం ప్రకటించారు.. పత్తి, గోధుమ, చెరకు పంటలకు ఎకరాకు రూ.25 వేల చొప్పున అందించనున్నారు. వరి పంటకు ఎకరాకు రూ.20 వేల సాయం ప్రకటించారు. సజ్జ, మినుము, పెసర, మొక్కజొన్న, రాగి, శనగ, సోయాబీన్, పొద్దుతిరుగుడు తదితర పంటలకు ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం అందించనున్నారు. ఇక, అరటి, పసుపు, మామిడి, జీడిమామిడి, కాఫీ, డ్రాగన్ ఫ్రూట్ తదితర పంటలకు ఎకరాకు రూ.35 వేల పరిహారం ప్రకటించారు. కూరగాయలు, బొప్పాయి, టమాట, పైనాపిల్ వంటి పంటలకు ఎకరాకు రూ.25 వేల సాయం అందించనున్నారు. తమలపాకు తోటలకు ఎకరాకు రూ.75 వేల పరిహారం ఇవ్వనున్నారు. కొబ్బరి, ఆయిల్ పామ్ చెట్లు దెబ్బతింటే ఒక్కో చెట్టుకు రూ.15 వేల చొప్పున సాయం అందిస్తామని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం..
Also Read
- Arnab Cyclone Relief: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.. బాధితులకు ఆర్థిక సాయం.. ఎవరికి ఎంత..? ఏ పంటకు ఎంతంటే..?
- Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
- Artificial Paneer Ban in AP: ఏపీలో పన్నీరు అమ్మకాలు బంద్..! ఏడాది పాటు నిషేధం
- AP Weather Alert: 9 జిల్లాల్లో భారీ వర్షాలు.. మరో 3 గంటలు జాగ్రత్త.. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి: APSDMA
తాజావార్తలు
-
OM Chapter 1: ధనుష్ ‘ఓం’ ఆడియో లాంచ్ అప్పుడేనా?
-
CJP: కాంగ్రెస్ నవంబర్ 1 ర్యాలీకి CJP మద్దతు..
-
Telangana Police :15 సెకన్లలో ముఖ గుర్తింపు.. ఫోన్లతోనే వేలిముద్రల సేకరణ!
-
AP Cabinet Emergency Meeting: అర్నబ్ తుఫాన్ నష్టంపై సమీక్ష.. రేపు కేబినెట్ అత్యవసర భేటీ
-
Cyclone Arnab: అర్నబ్ తుఫానులో 150 కి.మీ వేగంతో గాలులు.. అంతటి శక్తి ఎలా వచ్చింది.?
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!