Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్‌కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..

  • భూమిపై ఉండాలనుకుంటున్నారా.? చరిత్రలో కలవాలనుకుంటున్నారా?
  • పాకిస్తాన్‌కు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది స్ట్రాంగ్ వార్నింగ్..
Army Chief General Upendra Dwivedi

Army Chief General Upendra Dwivedi

Army Chief: భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ ఇలాగే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ, భారత్‌కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, ఆ దేశం భౌగోళికంగా ఉండాలనుకుంటున్నారా? లేదా చరిత్రలో భాగంగా కావాలనుకుంటున్నారో తేల్చుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఆపరేషన్ సిందూర్ జరిగి ఏడాది గడుస్తున్న సమయంలో ఆర్మీ చీఫ్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. మరోసారి పహల్గామ్ లాంటి దాడి జరిగితే భారత సైన్యం అదే రీతిలో లేదా అంతకన్నా ఎక్కువ తీవ్రతతో స్పందిస్తుందని ఆయన హెచ్చరించారు.

Read Also: Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..

ఢిల్లీలోని మానేక్‌షా సెంటర్‌లో ‘యూనిఫామ్ అన్‌వీల్డ్’ నిర్వహించిన ఒక ఇంటరాక్టివ్ సెషన్‌లో ఉపేంద్ర ద్వివేది ఈ వ్యాఖ్యలు చేశారు. గతేడాది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గామ్ ఉగ్రవాద దాడి చేసిన 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. దీని తర్వాత మే 7న భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పాకిస్తాన్, పీఓకే లోని ఉగ్రవాద స్థావరాలపై భారీ దాడి చేసింది. ఈ దాడిలో వందలాది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. దీని తర్వాత పాకిస్తాన్ సైన్యం భారత్‌పై దాడి చేయడానికి ప్రయత్నిస్తే, పాక్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఎయిర్ బేసుల్ని భారత్ ద్వంసం చేసింది.