Another Twist In Arjun Sarja Shruti Hariharan MeToo Case: గతంలో సినీ పరిశ్రమలో ‘మీటూ’ ఉద్యమం చెలరేగినప్పుడు.. బహుభాష నటుడు అర్జున్‌పై కన్నడ నటి శృతి హరిహరన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. 2018లో విస్మయ సినిమా షూటింగ్ సమయంల ఒక రొమాంటిక్ రిహార్సల్ చేస్తున్నప్పుడు.. అర్జున్ తనని అసభ్యంగా తాకాడని, తన అనుమతి లేకుండానే తనవైపుకి లాగాడని ఆరోపిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది. దీంతో.. కబ్బర్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పుడు అర్జున్ కూడా ఆమెపై పరువు నష్టం దావాతో కోర్టుకు వెళ్లాడు. ఇలా వీరి మధ్య జరిగిన ఈ వ్యవహారం.. అప్పట్లో కొన్ని రోజుల పాటు హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా.. ఈ న్యూస్ గురించే చర్చలు. క్రమంగా ఈ వ్యవహారం కనుమరుగవుతూ వచ్చింది. అయితే.. ఈ కేసు ఇప్పుడు మరోసారి తెరమీదకి వచ్చింది. ఈసారి ఈ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగుచూసింది. ఈ కేసుకి సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలు సమర్పించాలని.. బెంగళూరు 8వ ఏసీఎంఎం కోర్టు ఆమెకు నోటీసులు ఇచ్చింది. ఆమె నుంచి సాక్ష్యాలు సేకరించాలని పోలీసులను సైతం కోర్టు సూచించింది. ఈ కేసుకి సంబందించి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని 2021లో పోలీసులు కోర్టుకి బీ-రిపోర్ట్ సమర్పించగా.. దీనిని విచారించిన కోర్టు తాజాగా ఆమె నుంచి సాక్ష్యాలు సేకరించాల్సిందిగా పోలీసుల్ని సూచిస్తూ, ఆమెకు నోటీసులు ఇచ్చింది.
Pawan Kalyan OG: యూనిట్‌లో చేరిన క్రేజీ నటుడు.. మరింత వైబ్రెంట్‌గా ఓజీ
మరోవైపు.. కోర్టుకు పోలీసులు ఇచ్చిన బీ రిపోర్ట్‌ని శృతి హరిహరన్ సవాలు చేసిందని వార్తలు వచ్చాయి. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఆమె క్లారిటీ ఇచ్చింది. సాక్ష్యాధారాల విషయంలో కోర్టుకు పోలీసులు సమర్పించిన బీ-రిపోర్ట్‌ను తాను ఎప్పుడు సవాల్ చేయలేదని, అలాంటి కమ్యూనికేషన్ కూడా తనకు రాలేదని స్పష్టం చేశారు. సాక్ష్యాలు లేకపోవడంతో ఈ కేసుని ఈ సంవత్సరం ప్రారంభంలో మూసివేస్తున్నారని తనకు కోర్టు నుంచి నోటీసు వచ్చిందని.. దీన్ని సవాల్ చేసేందుకు తనకు 15 రోజుల గడువు ఇచ్చిందని ఆమె తెలిపింది. అయితే.. తాను సవాల్ చేయకూడదని నిర్ణయించుకొని, వెనకడుగు వేశానని.. పోలీసులకు కూడా ఇదే విషయం చెప్పానని పేర్కొంది. “ఈ రిపోర్టును సవాల్ చేయడంలో ప్రయోజనం లేదని నేను అనుకోలేదు. సాక్షులను వెతకాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. ఆరోజు సినిమా సెట్‌లో చాలామంది ఉన్నారు. వారిని విచారించి, సాక్ష్యాల్ని సేకరించాల్సిన బాధ్యత పోలీసులదే కదా? పోలీసులు తమ ఎఫర్ట్ పెట్టనప్పుడు, నేను ఆ నివేదికను సవాల్ చేసి ప్రయోజనం ఏంటి? అయినా.. నా వ్యతిరేకతను బహిరంగంగా వినిపించడమే నా విజయమని నేను గతంలో చాలాసార్లు చెప్పాను’’ అంటూ శృతి హరిహరన్ చెప్పుకొచ్చింది.
NBK109: అఫీషియల్.. ఆ బ్లాక్‌బస్టర్ దర్శకుడితో బాలయ్య నెక్ట్స్ మూవీ